40 ఏళ్ల మా సమస్యను సాకారం చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి ధన్యవాదాలు - మర్రిమంద గ్రామస్తులు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
గత పాలకుల నిర్లక్ష్యం వలన మర్రిమంద గ్రామ పంచాయతిలో ఎవరైనా మరణిస్తే మనిషిని పోగొట్టుకున్న బాధకంటే అంతిమయాత్ర జరపడానికి స్మశానవాటికకు దారి లేక ఎక్కువ ఇబ్బంది పడేవారు.కానీ మర్రిమంద ప్రజల చిరకాల సమస్యను నేడు ఎమ్మెల్యే గారు పరిష్కరించారు.
కావున గ్రామ ప్రజలందరూ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపి ఆయన స్పందనకు ఆజన్మాంతం రుణపడి ఉంటామన్నారు.
ఈ సందర్భంగా సోమవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం,ఏర్పేడు మండలం,మర్రిమంద గ్రామంలో స్మశానవాటికకు ఏర్పాటు చేసిన రోడ్డు ను ప్రారంభించారు MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.
ముందుగా ఎమ్మెల్యే గారికి మర్రిమంద గ్రామ ప్రజలు "ThankYou MLA Sir" అనే ప్లకార్డులు పట్టుకొని ఘన స్వాగతం పలికి హర్షధ్వానాల మధ్య క్రేన్ ద్వారా భారీ గజమాలను వేశారు.
No comments:
Post a Comment