రాజీ మార్గం రాజా మార్గం అని కక్ష దారులు సద్వినియోగం చేసుకోవాలని మరియు రాబోయే జూన్ 26వ తేదీ జరుగు జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సీనియర్ సివిల్ జడ్జి వై. శ్రీనివాసరావు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు సముదాయం నందు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేశారు.
శ్రీకాళహస్తి ఇంచార్జి సీనియర్ సివిల్ జడ్జి వై. శ్రీనివాస రావు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర , అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నరేంద్ర రెడ్డి, న్యాయవాదులు కోర్ట్ సిబ్బంది ...మొదలైనవాలు పాల్గొన్నారు .
.న్యాయమూర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ...... జూన్ 26వ తేదీన జరిగే నేషనల్ లోక్ అదాలత్ విజయవంతం చేసే విధంగా అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కేసుల నుంచి ఉపశమనం పొందాలన్నా రు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవడానికి సహకరిస్తూ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేయాలని, "రాజీమార్గమే రాజ మార్గంగా" ఎన్నుకొని ఎక్కువ కేసులని పరిష్కరించనికి దోహద పడాలని కోరారు.ఈ లోక్ అదాలత్ కి కోర్టులో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసుల్లో కక్షిదారులను ఒప్పించి అధిక సంఖ్యలో వాటిని రాజమార్గంలో పరిష్కరించడానికి సమిష్టి కృషి అవసరమని తెలిపారు.
ముఖ్యముగా అన్ని రకాల క్రిమినల్ మరియు సివిల్ కేసులు మరియు క్రిమినల్ కాంపౌండ్ కేసులు,
ఎన్ ఐ యాక్ట్ కేసుల్లో సుమారు 2రెండు లక్షల విలువగల చెక్కు ఎన్ ఐ యాక్ట్ కేసు u/s 138,
బ్యాంక్ రికవరీ కేసు, Mact కేసు, మ్యాట్రిమోనీ కేసు o/s 125 crps, లేబర్ డిస్ప్యూట్స్,
ల్యాండ్ ఆక్విసిషన్ కేసు, other సివిల్ కేసు, రెవెన్యూ కేసు, కాంపౌండ్ ఎక్సైజ్ కేసు,
ఫ్రీ లిటిగేషన్ కేసు లు.... మొదలైన కేసులు పరిష్కరించుటకు జాతీయ లోక్ అదాలత్ ఉపయోగించు కోవాలని కోరారు.
No comments:
Post a Comment