నాటు తుపాకులు తయారు చేస్తున్న వాలంటీర్... అరెస్ట్ చేసిన పోలీసులు
కార్వేటి నగరం చింతతోపు ఎస్టీ కాలనీ వాలంటీర్‌గా రవి
సోదాల్లో రెండు తుపాకులు, తయారీ పరికరాల స్వాధీనం
గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న యువకుడు నాటు తుపాకులు తయారు చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు.
చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కార్వేటి నగరం పరిధిలోని చింతతోపు ఎస్టీ కాలనీలో వాలంటీర్‌గా రవి అనే యువకుడు పని చేస్తున్నాడు.
వాలంటీర్ ముసుగులోనే అతడు గుట్టుగా నాటు తుపాకులు తయారు చేస్తున్నాడు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అతడి ఇంటిపై దాడి చేశారు.
ఈ దాడిలో వాలంటీర్ రవి తయారు చేసిన రెండు నాటు తుపాకులతో పాటు తుపాకుల తయారీకి వినియోగించే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు...!!
No comments:
Post a Comment