బీహార్ కు చెందిన జహీర్ అనే కార్మికుడు శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ కాలనీలోని టిడ్కో ఇళ్లకు టైల్స్ నిర్మిస్తున్న వ్యక్తి విద్యుత్ షాక్కు గురై మృత్యుఒడిలోకి చేరుకున్నాడు.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ టిట్కో ఇల్లు నిర్మాణం లో పనిచేస్తున్న బీహార్ కు చెందిన వలస కార్మికుడు జహీర్ విద్యుత్ షాక్కు గురై , కింద పడిన వెంటనే సరైన సమయంలో అతని చికిత్స కొరకు హాస్పిటల్ తరలించి ఉంటే అతడు బ్రతికి ఉండే అవకాశం ఉండేది. ఇక్కడ ఉండే సైట్ ఇన్చార్జులు ఇతని హాస్పిటల్ తరలించడంలో నిర్లక్ష్యం చేసినందువలన అతను మరణించడం జరిగింది. కానీ ఇక్కడ ఇటువంటి దుర్ఘటన జరిగినపుడు పట్టించుకునే నాధుడే లేనీ పక్షంలో జై భీమ్ ఆర్మీ వీళ్ళకి తోడుగా నిలుస్తుంది. ఈ మృతుని కుటుంబానికి కనీసం ఎక్స్గ్రేషియా కింద 30 లక్షలు చెల్లించవలసిన గా జై భీమ్ ఆర్మీ డిమాండ్ చేస్తుంది. ఈ కాళహస్తి నియోజకవర్గంలో పలు కంపెనీల్లో అనేక కాంట్రాక్టర్లు దగ్గర కొన్ని వేల మంది వలస కార్మికులు పనిచేస్తున్నప్పటికీ కి వీళ్ళకి ఇటువంటి దుర్ఘటన జరిగినపుడు దిక్కులేని అనాధలు వలె రోడ్డు మీదకు వస్తున్నారు. మేము డిమాండ్ చేసేది ఒకటే మనిషిని మనిషిగా చూడమని ఈ కాంట్రాక్టర్స్ ని కోరుతున్నాము. ఇకనైనా ఇటువంటివి జరిగినప్పుడు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులకు న్యాయం జరిగే ఈ విధంగా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాము. జైహింద్ జై భీమ్ జై జై భీమ్...
No comments:
Post a Comment