అసని తూఫాన్ సన్నద్ధత పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్
తూఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు స్థానికంగా అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్
స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:
రాష్ట్రంలో అసని తూఫాన్ కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు , ఎస్.పి.లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. గౌ.ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, భాదితుల పట్ల మానవతా దృక్పతంతో వ్యవహరించాలని, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. లోతట్టు ప్రాతాలలో ఉన్న వారిని ఖాళి చేయించి సహాయ కేంద్రాలకు తరలించి వారికి భోజనం వసతి సౌకర్యాలు కల్పించి వారు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి రూ.1000, కుటుంబానికి రూ.2000 చొప్పున వారి చేతిలో పెట్టలన్నారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో బుధవారం స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కే. వెంకట రమణా రెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మాట్లాడుతూ అసని తుఫాన్ ప్రభావిత సముద్ర తీర ప్రాంతంలో ఉన్న జిల్లాలోని ఐదు మండలాలు తడ, సూళ్ళూరుపేట, కోట, వాకాడు, చిల్లకూరు మండల కేంద్రాలలో 24/7 అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే పరిస్థితిని బట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. రెవిన్యూ, పోలీసు, జిల్లా యంత్రాంగం ప్రజల ప్రాణ నష్టం జరగకుండా అధిక ప్రాధాన్యత తో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టరేట్ , తుఫాను ప్రభావిత ప్రాంతాల తహశీల్దారు కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినందున అధికారులు, సిబ్బంది 24x7 అందుబాటులో ఉండి ఎప్పటికపుడు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని సత్వరమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. తుఫాను అనంతర వర్షాలు, ఈదురు గాలుల వలన చెట్లు రహదారులపై, కరెంటు తీగలపై పడి అంతరాయం కలగకుండా రెవెన్యూ, పోలీస్, R&B, ఎలక్ట్రిసిటీ అధికారులు సమన్వయంతో పునరుద్ధరణ చర్యలు వెనువెంటనే చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రికల్చర్ అధికారి దొరసాని, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి శంకర్ నారాయణ, SE, RWS విజయ్ కుమార్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు
No comments:
Post a Comment