తల్లిదండ్రులు తమ పిల్లలు ఈ వేసవి శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకొనుటకు పంపించాలి : సుజాత ప్రథమశ్రేణి గ్రంథాలయ అధికారిని - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, May 14, 2022

తల్లిదండ్రులు తమ పిల్లలు ఈ వేసవి శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకొనుటకు పంపించాలి : సుజాత ప్రథమశ్రేణి గ్రంథాలయ అధికారిని

తల్లిదండ్రులు తమ పిల్లలు ఈ వేసవి శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకొనుటకు పంపించాలి : సుజాత   ప్రథమశ్రేణి గ్రంథాలయ అధికారిని

 స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

శాఖా గ్రంధాలయం శ్రీకాళహస్తి నందు ఈ May  17/05/2022 తేదీన నుండి 30/06/2022 తేదీ వరకు  45 రోజులు వేసవి శిక్షణ తరగతులు ( Summer Camp ) నిర్వహించబడును.  ఈ  వేసవి శిక్షణా తరగతులు 6వ తరగతి నుండి  10 వ తరగతి విద్యార్థులకు (10  సంవత్సరాలు నుండి 15 సంవత్సరములు వరకు)  నిర్వహించబడును. ప్రతిరోజు ఉదయం 8  గంటలు నుండి 12 గంటల వరకు తరగతులు ఉండును. *ఈ వేసవి శిక్షణా తరగతులలో విద్యార్థినీ విద్యార్థులకు కు నీతి కథలు చెప్పడం విద్యార్థులచే సారాంశం చెప్పించడం, స్పోకెన్ ఇంగ్లీష్ , చిత్రలేఖనం,  పెయింటింగ్  మ్యూజిక్ ,డాన్స్, డ్రామా, యోగా, మొదలగు క్లాసెస్ నిర్వహించబడి వారిలో స్టేజ్ ఫియర్ పోగొట్టడం, వారిలోని మేధాశక్తిని పెంపొందించడం, వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్ది చైతన్యవంతులుగా చేయడం సమ్మర్ క్యాంప్ యొక్క ప్రాముఖ్యత.    గ్రంథాలయఅధికారినీ శ్రీమతి కె. సుజాత మాట్లాడుతూ ఈ  తల్లిదండ్రులు తమ పిల్లలు ఈ వేసవి శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకొనుటకు పంపించాలని వారిని ప్రోత్సాహపరచాలని, గ్రంథాలయం వేసవి శిక్షణ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని తెలిపారు. ఈ వేసవి శిక్షణ తరగతులు RPBHS పాఠశాలలో నిర్వహించబడును.

                       ఇట్లు

                   కె. సుజాత 

ప్రథమశ్రేణి గ్రంథాలయ అధికారిని

            శాఖా గ్రంధాలయం

                శ్రీకాళహస్తి

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad