దేశంలో కొత్తగా 1,675 కరోనా కేసులు నమోదు..
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో 1,675 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,31,40,068కి చేరింది.తాజాగా 1,635 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 4,26,00,737 మంది బాధితులు కోలుకున్నారు. మరో 31 మంది వైరస్ బారినపడి మృతి చెందగా.. మొత్తం 5,24,490 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలారు.ప్రస్తుతం దేశంలో 14,841 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 0.03శాతం ఉన్నాయని, జాతీయ కొవిడ్ రికవరీ రేటు 98.75శాతంగా ఉందని వివరించింది. గత 24గంటల్లో 4,07,626 కొవిడ్ టెస్టులు నిర్వహించగా.. ఇప్పటి వరకు 84.74కోట్లకుపైగా పరీక్షలు నిర్వహించినట్లు వివరించింది. మరో వైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. టీకాల కార్యక్రమంలో ఇప్పటి వరకు 192.52 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.
No comments:
Post a Comment