ఎయిర్పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా చైర్మన్ ని కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి.
స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:
నేడు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్ ఐ.ఏ.ఎస్ ని కలిసి తిరుపతి విమానాశ్రయానికి సంబందించిన పలు సమస్యలపై ఎంపీ ఆయనకి వివరించారు.
తిరుపతి విమానాశ్రయం ద్వారా ప్రయాణికుల రద్దీ గత మూడు నెలల కాలంలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుందని ఉడాన్ కార్యక్రమంలో భాగంగా దేశంలోని అన్ని విమానాశ్రయలకు విమాన సౌకర్యం ఆలాగే అంతర్జాతీయ విమానాల కనెక్టివిటీ కోసం తగు చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు
ఇప్పటికే ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉన్న విమానాశ్రయంలో ప్రయాణికులకి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మౌళిక వసతులు ఇంకా మెరుగు పరచాలని మరియు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కరెంట్ బుకింగ్లో తిరుపతి విమానాశ్రయంలో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు అందుబాటులో ఉంచేందుకు ఉద్దేశింపబడిన కౌంటర్ ఏర్పాటులో ఆలస్యం జరుగుతుందని అందుకు తగిన చర్యలు తీసుకొని సమస్య పరిష్కరించాలని కోరారు.
ప్రధానంగా నిర్వహణ, మరమ్మత్తుల కేంద్రం (ఎమ్మార్వో కేంద్రం) టెండర్ల ప్రక్రియ గురించి వాకబు చేసారు. ఏది ఏమైనా త్వరిత గతిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలనీ ఆయనని కోరగా అందుకు సానుకూలంగా స్పందించరని ఎంపీ మద్దిల గురుమూర్తి తెలియజేసారు.
No comments:
Post a Comment