కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం తొమ్మిది మంది మృతి ..!
కర్ణాటకలోని హుబ్లి శివారు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం ఉదయం కొల్హాపూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు అదే దారిలో వెళ్తున్న లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా 26 మందికి గాయలయ్యాయి.
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుబ్లిలోని కిమ్స్‌కి ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో లారీ, బస్సు డ్రైవర్ ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
No comments:
Post a Comment