స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శివయ్య పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అల్పాహారం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 30 వ వార్డు వై ఎస్ ఆర్ సి పి ఇంచార్జ్ మధు రెడ్డి పాల్గొని అల్పాహారం ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మధు రెడ్డి మాట్లాడుతూ పట్టణములో శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగా ప్రతి వ్యక్తి సన్మార్గములో నడవాలనే ఉద్దేశంతో భగవద్గీత వంటి అమూల్యమైన గ్రంథాలను పంపిణీ చేస్తున్నారని చాలా సంతోషం అన్నారు అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెంబాకం ముని కృష్ణారెడ్డి మాట్లాడుతూ భగవద్గీత వంటి అమూల్యమైన గ్రంథాలను ప్రతి ఒక్కరు చదివి గీత ను పాటించాలని ఒక భగవత్గీత గ్రంథం చదివితే అన్ని వేదాలను చదివినట్టు అన్నారు ప్రతి ఒక్కరు చదివి ఆచరించదగ్గ గ్రంథం భగవద్గీత అని పేర్కొన్నారు భగవద్గీత చదవాలన్న కోరిక ఉన్నవారికి ఆయన ఉచితంగా అందించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పుదూరు మోహన్ రెడ్డి శశి తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment