అన్ని దానాలలో కెల్లా అవయవ దానం చాల గొప్పది అని పిలుపునిచ్చిన న్యాయవాదుల
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వవ ప్రసూతి వైద్యశాల నందు అవయవ దానం పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మరియు పారా లీగల్ వాలంటరీ , కోర్ట్ సిబ్బంది, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయవాదులు మాట్లాడుతూ.... మన దేశంలో చాలా తక్కువ మందికి తెలిసిన ఈ అవధానంలో ముఖ్యంగా కళ్ళు అత్యంత ప్రధానమైనది అన్నారు. శరీరంలో ఏ అవయవం లేకపోయినా పర్వాలేదు కానీ కంటి చూపు లేకపోతే జీవితం అంతా అంధకారమేనని అన్నారు. పుట్టిన వ్యక్తి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోతారు కానీ , కంటి చూపు మాత్రం అంతం అనేది లేదు. ఎలాగంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా కొన్ని గంటల వరకు కంటిలో ప్రాణం ఉంటుందని, అటువంటి సమయంలో ఆ కళ్లు దానం చేసిన యెడల మరొకరికి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. కావున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అవయవదానానికి ప్రోత్సహించాలని కోరారు
No comments:
Post a Comment