శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో ఉన్న పందుల పెంపకముదారులకు తెలియజేయడము ఏమనగా, శ్రీకాళహస్తి పట్టణము నందు పందులు విపరీతముగా ఉన్నందున అంటు వ్యాధులు ప్రబలి ప్రజలు అనారోగ్యమునకు గురౌతున్నందున ముందస్తు చర్యల్లో భాగముగా పట్టణము నందు పందులు సంచరించకూడదని తెలియజేయడమైనది.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
ఈ రోజు అనగా తేదీ: 06-05-2022 కమిషనరు గారి ఛాంబర్ నందు పందుల పెంపకందారులతో సమావేశము నిర్వహించడమైనది. సదరు సమావేశమును ఉద్దేశించి కమిషనరు శ్రీ బి. బాలాజీ నాయక్ మాట్లాడుతూ పట్టణము నందు 15 రోజులలో పందులు ఎక్కడా సంచరించకూడదని నోటీసులు జారీ చేయడమైనది. సదరు నోటీసులు తీసుకున్న పందులపెంపకము దారులు తమకు 20 రోజుల వ్యవధి కావాలని కమిషనరు గారిని కోరడమైనది. సదరు విషయమై కమిషనరు గారు స్పందిస్తూ 20 రోజుల వ్యవధిలో పట్టణము నందు పందులు ఎక్కడ కూడా సంచరించకూడని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేయడమైనది. పట్టణము నందలి పందులు సంచరించినచో ప్రజారోగ్య చట్టము ప్రకారము చర్యలు తీసుకొనబడునని తెలియజేయడమైనది.
కావున, పందులు పెంపకముదారులు మీ యొక్క పందులను పట్టణమునకు 5కి.మీ. దూరములో ఉంచుటకు చర్యలు తీసుకొని, పట్టణమును పరిశుభ్రతగా మరియు అంటు వ్యాధులు ప్రబలకుండా సహకరించవలసినదిగా కోరడమైనది. అట్లు సహకరించని వారిని శాఖా పరమైన చర్యలు తీసుకొనబడునని తెలియజేయడమైనది. సదరు కార్యక్రమము నందలి మేనేజర్ బి. ఉమామహేశ్వర రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పి. రవికాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment