బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి ప్రస్తానమిదీ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, May 6, 2022

బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి ప్రస్తానమిదీ

 బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి ప్రస్తానమిదీ.... జననం.. 1949 సంవత్సరం...

 తల్లిదండ్రులు..విశాలక్ష్మమ్మ...గంగ సుబ్బరామిరెడ్డి...చదువు...బీఎస్సీ బీఎల్(ఎం ఏ) తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో గాలి. ముద్దుకృష్ణమ నాయుడుపై రెప్రజెంటే టివ్ గా పోటీ చేశారు..మంత్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి కుమార్తె బృందమ్మతో వివాహం..స్వగ్రామం ఊరందూరులో శ్రీ లక్ష్మీ ఆయిల్ మిల్లు నిర్వహణ... హైదరాబాదుకు మారిన మకాం...సివిల్ కాంట్రాక్టర్ గా ప్రఖ్యాతి...రాజకీయ నాయకులతో పరిచయాలు.. 1981లో శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నియామకం...(ఉన్నమ. సుబ్రమణ్యం నాయుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ) చంద్రబాబు నాయుడు తో పాటు 1984లో టీడీపీలో చేరిక..1985 మధ్యంతర ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మునిరామయ్య గెలుపునకు కృషి...(కుటుంబ సభ్యులు, తండ్రి, సోదరుడు కాంగ్రెస్ అభ్యర్ధి చెంచురెడ్డి కోసం పని చేశారు) 1988లో పార్టీ అభ్యర్థి శ్రీరామమూర్తి కోసం కృషి...  1989లో శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు అధ్యక్షుడుగా ఎన్నిక.. అదే సంవత్సరం ఎమ్మెల్యేగా మొదటి సారి ఎన్నిక...1994లో , 1999లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు..ఇప్పటి వరకు శ్రీకాళహస్తి లో ఎవరూ 3 సార్లు వరుసగా గెలవలేదు.. 2004లో ఓటమి..2009,   2014లో తిరిగి ఎన్నిక..1991 ఎంపీ ఎన్నికలలో కేవీబీపురం మండలం రాజుల కండ్రిగలో జరిగిన హత్యాయత్నం నుంచి,  2003లో జరిగిన అలిపిరి దాడి నుంచి బయట పడ్డారు..మాజీ మంత్రి పరిటాల రవి హత్య సమయంలో కూడా అత్యంత సమీపంలోనే ఉన్నారు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, విభజన తర్వాత మంత్రిగా పని చేశారు...వ్యక్తి గత ప్రయోజనాల కన్నా అభివృద్ధి పనులపై ఎక్కువ దృష్టి పెట్టేవారు..అనారోగ్య కారణాలతో 2019లో కుమారుడు సుధీర్ రెడ్డి పోటీ...ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు..శుక్రవారం శుక్ర మహా దశలో జన్మించిన ఆయన శుక్రవారం పరమ పదించారు..

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad