శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఘనంగా జరిగాయి.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
వైశాఖ శుద్ధ దశమి మే 11 తేదీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా బజారు వీధి శ్రీ వాసవి మాత గుడిలో అమ్మవారికి 108 కలశములతో క్షీరాభిషేకము జరిగినది. గణపతి హోమము, దేవి హోమము నిర్వహించబడినది. అమ్మవారికి విశేష పూల అలంకారం జరిగినది. వాసవి మహిళా మండలి వారి రాగమాలిక గ్రూపు సభ్యులచే విశేష నృత్యప్రదర్శన కార్యక్రమం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. సాయంకాలం అమ్మవారి పల్లకి ఊరేగింపు పురవీధులలో ఘనంగా జరిగినది. పై కార్యక్రమము లన్నీ వాసవీ సేవకుల కమిటీ, వాసవి యువజన సంఘము, వాసవి మహిళా మండలి వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
No comments:
Post a Comment