కుమారస్వామి తిప్ప బాలాలయం కు అంకురార్పణ : చైర్మన్ అంజూరు శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధాలయము కుమారస్వామి తిప్ప యందు కొలువైవున్న శ్రీ కుమార్ స్వామి వారి ఆలయమునకు 1995 సంవత్సరం లో కుంభాభిషేకం నిర్వహించివున్నారు. 12 సంవత్సరములకు ఒక పర్యాయము నిర్వహించవలసిన మహా కుంభాభిషేకం ఆ తరువాత ఇప్పటి వరకు నిర్వహించకపోవడం గుర్తించిన నూతన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ధర్మకర్తల మండలి వారు ఆలయ పెద్దలకి తెలియజేయడమైనది. ఆలయ పెద్దలు స్వామినాథన్ గురుకుల్ గారు ఈరోజు లగ్నాన్ని ఆలయం నందు నవశకానికి అంకురార్పణ చేయడం జరిగినది. అలాగే రెండు రోజుల్లో బాలాలయం జరుగుతుందని జూన్ 8వ తేదీన కుంభాభిషేకం జరుగుతుందని కావున యావన్మంది కుమారస్వామి భక్తులకు తెలియజేయడం ఏమనగా జూలై 8 వరకు వారి దర్శనం ఉండదని జూలై 8న ఉదయం 10 గంటలకు మహాకుంభాభిషేకం తర్వాత స్వామివారి దర్శనం తో పాటు స్వామివారి కృపా కటాక్షాలు పొందవచ్చునని అలాగే జూలై 8న జరగబోవు మహాకుంభాభిషేకం 1995వ సంవత్సరంలో జరిగిన తర్వాత ప్రస్తుతం కుమార స్వామి తిప్ప, దుర్గమ్మ కొండ మరియు శ్రీ ప్రసన్న వరదరాజస్వామి దేవాలయాల నందు మహాకుంభాభిషేకాలు జరిగే అవకాశం ఇచ్చిన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి ద్వారా ఏర్పడిన ధర్మకర్తల మండలి వారి అదృష్టంగా భావిస్తూ జరగబోవు మహా కుంభాభిషేకం ఉత్సవంలో భక్తులు, పుర ప్రజలు పాల్గొని స్వామివారి కృపా కటాక్షములు పొందాలని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో... ఈ కార్యక్రమంలో బోర్డ్ సభ్యులు జిల్లా కృష్ణయ్య ఆలయ అధికారులు AC మల్లికార్జున్, సబ్ టెంపుల్స్ ఇన్ ఛార్జ్ లక్ష్మయ్య స్థపతి కుమార్ సెన్నేరు కుప్పం శేఖర్, పసల కుమారస్వామి, కళ్యాణ్ అమ్మ రాజేష్ బాల గౌడ్, సునీల్, ప్రసాద్
No comments:
Post a Comment