తీవ్ర తుపాను నుంచి తుపాన్ గా బలహీనపడిన అసాని
తీవ్రతుపాను నుంచి తుపానుగా అసాని (Asani) బలహీనపడిందని, గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.గడిచిన 6 గంటల్లో గంటకు 6 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదిలింది... ప్రస్తుతం మచిలీపట్నంకు 50 కి.మీ., కాకినాడ 150 కి.మీ., విశాఖపట్నం 310 కి.మీ., గోపాలపూర్ 530 కి.మీ., పూరీకు 640 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని అధికారులు తెలిపారు. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందన్నారు. సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని, ఈ రోజు కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గురువారం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు... అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడతాయన్నారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు పేర్కొన్నారు.
No comments:
Post a Comment