సత్యవేడు మండలం చెన్నేరి వద్ద రోడ్డు ప్రమాదం
లారీ, మినీ వ్యాన్ ఢీకొని పలువురికి తీవ్ర గాయాలు
సత్యవేడు మండలం చెన్నేరి గ్రామానికి సమీపంలో రోడ్డు ప్రమాదం బుధవారం రాత్రి సంభవించింది. తమిళనాడు ఊతుకోట నుంచి మినీ వ్యాన్ కొందరి ప్రయాణికులతో సత్యవేడు వైపు వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో మినీ వ్యాన్ లోనే పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ తో సహా మినీ వ్యాన్లో తొమ్మిది మంది ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మినీ వ్యాన్ డ్రైవర్తో పాటు ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.ఇందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వ్యాన్లో ఉన్నవారందరూ పుదుకుప్పం గ్రామానికి చెందిన వారిని సమాచారం. రోడ్డు ప్రమాదం నేపథ్యంలో ట్రాఫిక్ జాం కావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదం పై వివరాలు తెలుసుకుంటూ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.
No comments:
Post a Comment