తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి
స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:
ఈ కార్యక్రమంలో ముందుగా తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి నివాసం నుండి గంగమ్మకు సారి తీసుకువచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు.
తిరుపతి పట్టణంలో వెలసిన భక్తుల కొంగు బంగారం తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర సందర్బంగా గంగమ్మను ఎంపీ గురుమూర్తి దర్శించుకొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఆలయ చైర్మన్ గారు స్వాగతం పలికారు, తదుపరి అమ్మవారిని దర్శించుకొన్న ఎంపీ గారికి అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్బంగా ఎంపీ గారు మాట్లాడుతూ గంగమ్మ తల్లి చల్లని ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మని ప్రార్ధించానని ఎంపీ గురుమూర్తి గారు తెలియజేసారు.
No comments:
Post a Comment