అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి - తిరుపతి ఎంపీ గురుమూర్తి
౩౦౦కోట్ల రూపాయల అంచనాలతో పట్టాలెక్కిన పనులు
స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:
కొన్ని సంవత్సరాలుగా మరుగున పడ్డ డిమాండ్ ఎంపీ కృషితో కదలిక శాఖాపరమైన ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర రైల్వే శాఖ
మూడు సంవత్సరాల గడువులో పూర్తి
ఆధాత్మిక నగరమైన తిరుపతిలో అందుకు తగిన విధంగా రైల్వే స్టేషన్ డిజైన్ ఉండాలని అని కేంద్ర మంత్రిని మరోసారి కలవనున్న ఎంపీ.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బాలాజీ ఆలయానికి చేరుకోవడానికి తిరుపతి రైల్వే స్టేషన్ ద్వారా లక్షల సంఖ్యలో ఏటా భక్తులు ప్రయాణిస్తుంటారు అందువల్ల తిరుపతి రైల్వేస్టేషన్ అంతర్జాతీయ ప్రమాణలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి అని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నా ఆ దిశగా అడుగులు పడలేదు.
ఎంపీగా ఎన్నికైనప్పటి నుండి ఈ సమస్యపై పలుమార్లు పార్లమెంట్లో ప్రస్థావించడం, కేంద్ర మంత్రులని కలవడం జరిగింది. తత్ఫలితంగా తిరుపతి రైల్వే స్టేషన్‌ను 299 కోట్ల రూపాయలతో "మేజర్ అప్‌గ్రేడేషన్ ఆఫ్ తిరుపతి" పేరుతో తిరుపతి స్టేషన్‌ను పునరాభివృద్ధి చేయాలని రైల్వే బోర్డు దక్షిణ మధ్య రైల్వేను ఆదేశించింది.
దీని ప్రకారం దక్షిణ మధ్య రైల్వే ఒక మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా
బేస్మెంట్ మరియు గ్రౌండ్ +3 అంతస్తులతో దక్షిణం వైపు స్టేషన్ భవనం అభివృద్ధి, ఉత్తరం వైపు గ్రౌండ్ +3 అంతస్తులలో స్టేషన్ భవనం అభివృద్ధి.
స్టేషన్ భవనానికి ఉత్తరం మరియు దక్షిణం వైపులను కలుపుతూ 35 మీటర్ల వెడల్పుతో 2 ఎయిర్ కోర్సుల నిర్మాణం
ఇప్పటికే ఉన్న స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లను మెరుగుపరచడం,
దక్షిణ భాగంలోని భవనంలో, బేస్‌మెంట్‌లో పార్కింగ్ సదుపాయం, డిపార్చర్ కన్‌కోర్స్, అరైవల్ కన్‌కోర్స్, టికెట్ కౌంటర్, గ్రౌండ్ ఫ్లోర్‌లో వెయిటింగ్ లాంజ్, కామన్ వెయిటింగ్ హాల్ ఏరియా, ఫిమేల్ వెయిటింగ్ ఏరియా, ఫుడ్ కోర్ట్, టాయిలెట్స్, క్లోక్ రూమ్, మొదటి మరియు రెండవ అంతస్తులలో రైల్వే కార్యాలయాలు మరియు మూడవ అంతస్తులో విశ్రాంతి గదులు.
ఉత్తరం భాగంలోని భవనంలో డిపార్చర్ కన్‌కోర్స్, అరైవల్ కన్‌కోర్స్, గ్రౌండ్ ఫ్లోర్‌లో టికెట్ కౌంటర్ వెయిటింగ్ లాంజ్, కామన్ వెయిటింగ్ హాల్ ఏరియా, వీఐపీ లాంజ్, టాయిలెట్స్, మొదటి అంతస్తులో క్లోక్ రూమ్, వెయిటింగ్ హాల్, షాపులు, కియోస్క్‌సిన్ సెకండ్ ఫ్లోర్, మూడో అంతస్తులో రైల్వే ఆఫీసులు.
వెయిటింగ్ హాల్, దుకాణాలు, ఫుడ్ కోర్ట్, ఎయిర్‌కోర్స్‌లో బెంచీలు.
ఆలాగే మొత్తంగా 23 లిఫ్ట్‌లు మరియు 20 ఎస్కలేటర్‌లు, ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే సిస్టమ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, cctv కెమెరాలు, కోచ్ ఇండికేషన్ బోర్డులు మరియు ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి రైలు సూచిక బోర్డులతో తిరుపతి రైల్వేస్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త హంగులతో రూపుదిద్దుకోనుందని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.
No comments:
Post a Comment