శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నుండి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారు మరియు కార్యనిర్వాహణాధికారి శ్రీ సాగర్ బాబు గార్లు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు , ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది తో కలిసి శ్రీ అర్ధనారీశ్వర స్వామి వారి దేవాలయము నందు ఎమ్మెల్యే దంపతులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి దేవస్థానం వేద పండితులతో వేద మంత్రాలతో ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేసి, దుశ్శాలువలతో, పూలమాలలతో సత్కరించి, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు
No comments:
Post a Comment