జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, మెగాస్టార్ చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని శ్రీకాళహస్తి పట్టణంలో హెల్పింగ్ హాండ్స్ స్వచంద సేవ సంస్థ
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీ. మునీర్ గారు గత 10 సం. గా అనేక మంది వికలాంగులకు ప్రతి నెలా నిత్యావసర వస్తువులు దానం చేస్తున్నారు. ఈరోజు 126 వ నెల నిత్యావసర వస్తువులు దానం చేసే కార్యక్రమంకు ముఖ్య అధితిగా జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారిని ఆహ్వానించి వినుత గారి చేతులు మీదుగా వికలాంగులకు నిత్యావసర వస్తువులను దానం చెయ్యడం జరిగింది. చిన్నపాటి ఫ్యాన్సీ షాపు ను నడుపుతూ అందులో వచ్చే లాభంతో ప్రతి నెలా వికలాంగులకు సహాయ సహకారాలు అందించడం చాలా ఔదార్యాన్ని చాటుతున్న మునీర్ గారిని జనసేన పార్టీ ఏళ్ల వేళలా తోడుగా ఉంటుందని తెలుపుతూ మునీర్ గారిని ,వారి బృందాన్ని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మణికంఠ, తేజా, సురేష్, గిరీష్, వినోద్, నితీష్ కుమార్, చందు చౌదరి, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment