ఆత్మగౌరవానికిప్రతీకనందమూరితారకరామారావు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, May 28, 2022

ఆత్మగౌరవానికిప్రతీకనందమూరితారకరామారావు

ఆత్మగౌరవానికిప్రతీకనందమూరితారకరామారావు
అన్నగారిశతజయంతివేడుకలుశ్రీకాళహస్తిపట్టణంలోఘనంగాజరుపుకున్నారు  


ఈ సందర్భంగా మాజీ శ్రీకాళహస్తీశ్వర బోర్డుసభ్యుడు గురప్ప శెట్టి, సీనియర్ నాయకులు అద్దంకి డాoగే, కొల్లు విజయలక్ష్మి, చక్రాల ఉష, మాట్లాడుతూ...

 సమాజంలో కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన రాజకీయాలను సామాన్యుని చెంతకు చేర్చే లక్ష్యంతో #సమాజమేదేవాలయం_ప్రజలేదేవుళ్లు’ అనే నినాదంతో రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, తెలుగుదేశం పార్టీ  ఆవిర్భావమే ఒక సంచలనం అన్నారు. తెలుగు సినీ వినీలాకాశంలో తనను ధ్రువతారగా నిలిపిన తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలనే తపన, ఆశయంతో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని   పాలకులు పదవుల కోసం ఢిల్లీ యాత్రలు చేస్తూ... తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకులకు పాదాక్రాంతం చేసిన పరిస్థితుల్లో తనను ఆదరించిన ఆంధ్రులను సుడిగుండం నుంచి గట్టెక్కించడానికి ఎన్టీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమని చెప్పారు. టీడీపీ ఆవిర్భవించిన కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే ఏపీలో అధికారం చేపట్టడం ఎన్టీఆర్ గొప్పతనానికి నిదర్శనమన్నాను. ఎన్టీఆర్ తన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చలు అంటించుకోలేదన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి... పేద ప్రజల సంక్షేమానికి ఎన్టీఆర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. నేడు సామాన్యుడు కూడా రాజకీయాల్లో ఉన్నాడంటే అందుకు కారణం రామారావేనని ఆమె తెలిపారు. మండల వ్యవస్థ ఏర్పాటు చేసి పరిపాలన వికేంద్రీకరణ చేసిన ఘనత కూడా ఎన్టీఆర్ కే చెందుతుందని,దేశంలోనే మొట్టమొదటి సారిగా పేదవారికి రూ.2లకే కిలో బియ్యం పధకం ప్రవేశ పెట్టిన ఘనత రామారావుకే దక్కిందన్నారు. ఈ పథకం మొట్టమొదట మన జిల్లాలోని భాకరాపేట నుంచి ఆయన ప్రారంభించారని ఈ సందర్భంగా  గుర్తు చేశారు. #పక్కాగృహాలనిర్మాణం, #జనతావస్త్రాలపంపిణీ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేశారన్నారు.  దేవుడు ఇచ్చిన భూమికి శిస్తు ఏమిటంటూ... రైతులకు భూమి శిస్తు రద్దు  చేసిన అసలు సిసలైన సంస్కరణల రూపశిల్పి ఎన్టీఆర్ అని అన్నారు నేడు తూర్పు  రైతులకు వరంగా ఉన్న తెలుగుగంగ కూడా ఎన్టీఆర్ పుణ్యమేనన్నారు. తిరుమలలో నేడు వేలాదిమందికి ఆకలి తీర్చుతున్న నిత్యాన్నదాన పథకం కూడా ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిందేనని ఆమె తెలిపారు. శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో మహిళల కోసం రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయించిన ఘనత కూడా రామారావుదేనని  తెలిపారు. జిల్లాలో ఎందరికో రాజకీయ జీవితం ప్రసాదించిన మహోన్నత వ్యక్తి రామారావు అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిత్యం పని చేసిన గొప్ప రాజకీయ నేత రామారావు అన్నారు. ఆయన ఆంధ్రుల ఆరాధ్యదైవమన్నారు. అలాంటి మహనీయుని స్మరించుకుంటూ... జయంతి వేడుకలు నిర్వహించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.ముఖ్యం నాలుగు గోడల మద్య ఉంటున్న మహిళలను ముందుకు తీసుకొచ్చి విద్యా రంగం లో పెను మార్పు తెచ్చి మహిళా యూనివర్సిటీలు నిర్మించి మహిళలు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించారు, రాజకీయ రంగంలో కూడా  వాడికి సముచిత స్థానం ఇస్తూ ప్రోత్సహిస్తూ వారి అభ్యున్నతికి తోడ్పాటు నిచ్చారు, ఆస్తిలో ఆడబిడ్డలకు కూడా సమాన హక్కు కల్పించిన దేవుడని, తెలుగుదేశం పార్టీ అనే మొక్క నాటి ఇప్పటివరకు ఆ మహా వృక్షం లో ఎంతోమంది సేద తీర్చుకునే అవకాశం కల్పించి  ఇప్పుడు కూడా ఎంతో మంది ఆ చెట్టు నీడనే బ్రతుకుతూ ఉన్నారని, ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నారాయణ,మాజీ కౌన్సిలర్లు మునికృష్ణ, అనిత,పట్టణ ఉపాధ్యక్షులు పోలూరు శ్రీనివాస రెడ్డి, ఖాదర్ బాషా,MS రెడ్డి, సుబ్బారెడ్డి,యాదగిరి,మస్తాన్,ఢిల్లీ బాబు,గోవిందయ్య,కొట్టే అనిల్, రాము, సంపత్, గరికపాటి సుధాకర్,మీర్జా,చాన్ భాష,లోకేష్, కేశవ,శెట్టి
 పట్టణ మహిళా అధ్యక్షురాలు సుమతి,రవణమ్మ, శ్రీలక్ష్మి,వేదవతి, సుజాత,నేతలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad