రేణిగుంట నుండి శ్రీకాళహస్తి వరకు సర్వీస్ రోడ్ కోసం వినతి
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ కేంద్ర కార్యదర్శి గిరిధర్ ఆర్మానీని కలిసిన గురుమూర్తి
ఈరోజు ఢిల్లీలో రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ కేంద్ర కార్యదర్శి గిరిధర్ ఆర్మానీ తో భేటీ అయిన తిరుపతి ఎంపీ గురుమూర్తి తిరుపతి రేణిగుంట నుండి శ్రీకాళహస్తి వరకు సర్వీస్ రోడ్డు ఆవశ్యకత గూర్చి వివరించారు. జాతీయ రహదారి 71 నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న 6 లైన్ల రహదారి కి ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మించాలని ఈ రహదారి అత్యంత రద్దీ కలిగిందని ఈ రహదారి వైజాగ్ నుండి బెంగుళూరు వరకు ఉన్న అన్ని ప్రధాన పట్టణాలకు కనెక్టివిటీ ఉంటుందని చెప్పారు. అందువలన ఈ రహదారి మార్గం ద్వారా గణీయమైన సంఖ్యలో భారీ వాహనాల ద్వారా సరకు రవాణా చేసేందుకు మరియు ప్రజలు ప్రయాణించేందుకు ఎంచుకుంటారని మరియు తిరుపతి నుండి శ్రీకాళహస్తికి వేల సంఖ్యలో భక్తులు ప్రయాణిస్తారని పలు సందర్భాలలో వాహన ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు, తద్వారా ప్రమాదాల నివారణకు సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాలనీ, జాతీయ రహదారి నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి కేంద్ర కార్యదర్శి గిరిధర్ ఆర్మానీ కి విన్నవించారు.
No comments:
Post a Comment