తిరుపతి జిల్లా, వెంకటగిరి సెంట్రల్ స్కూల్ లో ఇంటర్ విద్య కు కేంద్ర ప్రభుత్వ అనుమతి :
వెంకటగిరి సెంట్రల్ స్కూల్ లో సెంట్రల్ సిలబస్ గల పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు... సెంట్రల్ సిలబస్ కలిగిన ఇంటర్మీడియట్ కోర్సు చదవడానికి దగ్గరలో కళాశాల లేనందున... దాంతో చాలా మంది వెంకటగిరి సెంటర్ స్కూల్ లో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు తమ విద్యను పదో తరగతితోనే ముగించాల్సి వస్తోందనికావున ఈ విద్య సంవత్సరం వెంకటగిరి సెంట్రల్ స్కూల్ లో ఇంటర్ విద్య కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఢిల్లీ లో కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి. అన్నపూర్ణ దేవి గారిని తిరుపతి ఎంపీ కురుమూర్తి శుక్రవారం నాడు కలిసి వినతి పత్రం ద్వారా విన్నవించుకున్నారు. అందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎంపీ శ్రీ. మద్దెల గురు మూర్తి గారికి హామీ ఇచ్చారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ.ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల వెంకటగిరి సెంట్రల్ స్కూల్ ను సందర్శించి. అనంతరం అదే రోజు కేంద్రీయ విద్యాలయం లో central syllabus కలిగిన ఇంటర్ విద్య అనుమతి కోసం నెల్లూరు ఊరు కు చెందిన కేంద్ర సంబంధిత ప్రభుత్వ అధికారి ప్రభాకర్ తో మాట్లాడటం... వారు స్పందించి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపమని కోరడం.. అదేవిధంగా సెంట్రల్ స్కూల్ జిల్లా కమిటీ చైర్మన్, నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ. కె.వి.ఎన్ చక్రధర్ బాబు గారితో ఫోన్లో మాట్లాడి వెంకటగిరి లో సెంట్రల్ సిలబస్ కలిగిన ఇంటర్మీడియట్ విద్యా కోర్సును ప్రవేశ పెట్టే విధంగా ప్రతిపాదనలు తయారు చేసి కేంద్ర విద్యా శాఖ కు పంపించాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే. వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ. ఆనం రామనారాయణ రెడ్డి ఒక ప్రక్క ... తిరుపతి ఎంపీ శ్రీ. మద్దెల గురు మూర్తి మరో ప్రక్క కృషితో "వెంకటగిరి కేంద్రీయ విద్యాలయం" లో ఇంటర్మీడియట్ సెంట్రల్ సిలబస్ కోర్సుకు అనుమతి లభించిందని తెలియడంతో... విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment