ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఆదేశాలతో సాగు నీటి లభ్యత, సరఫరా, పంపకాల పై జరిగిన సమావేశంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:
ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, గూడూరు శాసనసభ్యులు వరప్రసాదరావు, సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, వాకాటి నారాయణ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, తెలుగుగంగ చీఫ్ ఇంజనీర్, ఇరిగేషన్ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్న ఈ సమావేశంలో త్రాగు, సాగు నీటికి సంబందించిన పలు సమస్యలపై కూలంకుషంగా చర్చించారు.
జిల్లాల పునర్విభజన తరువాత జిల్లాల మధ్య నీటి పంపకాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు అందరూ కోరారు. ఆలాగే పెండింగ్ లో ఉన్న తెలుగుగంగ కాలువలు పూర్తి చేయవలసినదిగా కూడా విన్నవించారు.
ఈ సందర్బంగా సూళ్లూరుపేట శాసనసభ్యులు మాట్లాడుతూ ఆరిమేనిపాడు చెరువుకి సంబంధించి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబందించిన దీర్ఘకాలిక సమస్యపై త్వరగా మంజూరు చేసి పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లారు.
తదుపరి మాట్లాడిన ఎంపీ గురుమూర్తి జిల్లాల పునర్విభజన తరువాత తిరుపతి జిల్లా పరిధిలో ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నాయని ఇవన్నీ కూడా కండలేరు జలాశయంపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. ఈ ఆయకట్టుకు పూర్తి శాశ్వత నీటి పంపిణీ ఉండాలని ఆలాగే పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ది చెందుతున్న తిరుపతి జిల్లాకు నీటి అవసరం ఎంతైనా ఉందని, తిరుపతి జిల్లా పరిధిలో మునిసిపాలిటీలు అన్ని కూడా అధిక జన సాంద్రత కలిగి ఉన్నందువలన వారి త్రాగునీటి అవసరాలను తీర్చేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలనీ సభా వేదిక నుంచి అధికారులకి పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సహకారం తో అధికారుల సమన్వయంతో అన్ని సమస్యలను అదిగమిస్తామని ధీమా వ్యక్తం చేసారు.
No comments:
Post a Comment