పారదర్శకంగా భూముల రీ సర్వే -ఆర్డీవో భానుప్రకాశ్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూముల రీసర్వే పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాశ్ రెడ్డి చెప్పారు. శ్రీకాళహస్తి మండలం మన్నవరంలో శుక్రవారం రీ సర్వే గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీవో భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘ కాలికంగా భూ సమస్యలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అత్యధికంగా భూముల సమస్యలు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూముల రీ సర్వే చేయాలని నిర్ణయించిందన్నారు. ఈ రీ సర్వే రైతుల సమక్షంలోనే వివాదాలకు తావులేకుండా రెవిన్యూ సిబ్బంది చేస్తోందన్నారు. మొదటి విడతలో భాగంగా ఎర్రగుడిపాడు రెవిన్యూ పరిదిలో రీ సర్వే పూర్తి చేశామన్నారు. రెండవ విడతలో మన్నవరంలో 4,125 ఎకరాలు, కొత్తపల్లి చింతలలో 425 ఎకరాల్లో రీ సర్వే చేస్తున్నామన్నారు. ఇందుకోసం మన్నవరం పరిధిలో ఆరు, కొత్తపల్లిచింతల పరిధిలో రెండు బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో బృందంలో వీఆర్వో, విలేజ్ సర్వేయరు, వీఆర్ ఏ సభ్యులుగా ఉంటారన్నారు. మొదటగా గ్రామ సభ ఏర్పాటు చేసి రీ సర్వే మొదలు పెడతామన్నారు. రైతుల నుంచి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ సభలో స్వీకరిస్తామన్నారు. రీ సర్వేలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే రైతులు తెలియచేయాలని ఆర్డీవో బానుప్రకాశ్ రెడ్డి కోరారు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతుల జాబితా ప్రదర్శిస్తామన్నారు. ఇందులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామన్నారు. రైతులు ఈ అవకాశం వినియోగించుకోవాలని ఆర్డీవో భానుప్రకాశ్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఇన్ ఛార్జి తహసీల్దారు ప్రేమ్ కుమార్, ఐఓఎస్ రాంప్రసాద్, మండల సర్వేయరు పురుషోత్తం, వీఆర్వో వినోద్ కుమార్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment