సెప్టెంబర్ 3న ఆర్టెమిస్-1 ప్రయెగం..! - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, September 1, 2022

సెప్టెంబర్ 3న ఆర్టెమిస్-1 ప్రయెగం..!

 NASA:సెప్టెంబర్ 3న ఆర్టెమిస్-1 ప్రయెగం..!



చంద్రుడిపైకి వ్యోమ నౌకలను పంపేందుకు నాసా చేపట్టిన ఆర్టెమిస్‌-1 ప్రయోగం సెప్టెంబర్‌ 3వ తేదీన చేపట్టనున్నారు.ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి సోమవారమే జరగాల్సిన ఈ ప్రయోగం ఇంధన ట్యాంకులో సమస్య కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సమస్యలను సరిచేసి రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేశారు. నాసా ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత శక్తిమంతమైన రాకెట్‌ ఇదే కావడం విశేషం. శనివారం ప్రయోగానికి అనువైన వాతావరణం ఉండే అవకాశాలు 40 శాతం వరకు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో దాదాపు 322 అడుగుల పొడవున్న ఈ భారీ రాకెట్‌ను కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌లోనే ఉంచారు.

అన్నీ సానుకూలంగా జరిగితే శనివారం మధ్యాహ్నాం 2.17 నిమిషాలకు లభించే లాంఛ్‌ విండోలో ఈ రాకెట్‌ ప్రయోగం జరుగుతుంది. ఈ సారి మానవరహిత ఓరియన్‌ స్పేస్‌ క్యాప్సుల్‌ను రాకెట్‌తోపాటు అంతరిక్షంలోకి పంపనున్నారు.

అపోలో ప్రాజెక్టు తర్వాత 50 ఏళ్లకు మరోసారి చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు నాసా ప్రతిష్ఠాత్మకంగా ఆర్టెమిస్‌ ప్రాజెక్టును చేపట్టింది. సోమవారం ప్రయోగానికి మొత్తం సిద్ధం చేశాక.. ప్రధాన ఇంజిన్లు పనిచేయడానికి అవసరమైన ప్రీలాంఛ్‌ ఉష్ణోగ్రతను అందుకోవడంలో విఫలం అయ్యాయి. దీంతో ప్రయోగాన్ని చివరి నిమిషంలో నిలిపివేశారు. దీనిపై నాసా ఆర్టెమిస్‌ లాంఛ్‌ డైరెక్టర్‌ ఛార్లీ బ్లాక్‌వెల్‌ థాంప్సన్‌ మాట్లాడుతూ ఈ సారి ఇంజిన్ల కూలింగ్‌ ప్రక్రియ లాంఛ్‌ కౌంట్‌డౌన్‌కు 30 నిమిషాల ముందే మొదలు పెడతామని పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad