ఆక్స్ ఫర్డ్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాంకుల ప్రభంజనం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, September 2, 2022

ఆక్స్ ఫర్డ్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాంకుల ప్రభంజనం

 ఆక్స్ ఫర్డ్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాంకుల ప్రభంజనం 


 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


ఎస్వీయూనివర్సిటీ విడుదల చేసిన 6వ సెమిస్టరు ఫలితాలలో ఆక్స్ ఫర్డ్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాంకుల ప్రభంజనం సృష్టించారు. ఆదివారం ఎస్వీయూనివర్సిటీ విడుదల చేసిన 6వ సెమిస్టరు ఫలితాలలో ఆక్స్ఫర్డ్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పట్టణ, యూనివర్సిటీ స్థాయిలలో అన్ని గ్రూపులలో అగ్ర స్థానాలను కైవసం చేసుకున్నారు. బి.ఎస్సీ (యం.పి.సీఎస్ )గ్రూపులో సి.సంధ్యారాణి (9.25),జి.జ్ఞాన ప్రకాష్ (9.08),పి. తేజో సాయి (9.07), బి. ఎస్సీ (యం.యస్ .సీఎస్) గ్రూపులో వి. హేమప్రియ (9.59), కె.ముని ఉమా దేవి (9. 45), ఈ. పావని (9.39), బి.ఎస్సీ (యం.పి.సి గ్రూపులో జి.ప్రేమా (8.78),సి. జ్ఞాన ప్రసూనా (7. 19), బి.ఎస్సీ (బయో టెక్నాలజీ ) గ్రూపులో యన్. పూజిత (9.43), ఎ.రాసి (9.20), బి.యశ్విత (9.07) పాయింట్లతో యూనివర్సిటీ స్థాయిలో వరుసగా ప్రధమ ,ద్వితీయ ,తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. బి. కామ్ (సి.ఎ) గ్రూపునందు జె.కావేరి (9.47), కె.చందన (9.19), ఏ.యస్.హర్ష వీణ (9.09), పి.ధరణి (9.07) పాయింట్లతో పట్టణ, యూనివర్సిటీ స్థాయిలో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సి.మధు సూధన్ రెడ్డి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులను అభినందించారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad