శ్రీకాళహస్తి పట్టణంలోని సబ్ జైల్ పరిశీలించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నరేంద్ర రెడ్డి
స్వర్ణముఖి న్యూస్,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సబ్ జైల్ ఆకస్మిక పరిశీలించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నరేంద్ర రెడ్డి.
సబ్-జైలు పరిసర ప్రాంతాలు, వారి వసతి గదులు, బాత్ రూమ్ లు , భోజనశాల ...మొదలైనవి పరిశుభ్రతపై పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి సమస్యల పై అరా తీశారు. జైలు పరిశుభ్రత పై అసంతృప్తి వెక్తం చేసారు.సంబంధిత అధికారులకు తెలిపి వెంటనే సమస్య పరిష్కరించాలని జైలు అధికారులకు ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమన్నారు, పరిశుభ్రంగా ఉంటే మనము మరియు మన చుట్టుపక్కల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార లీగల్ వాలంటరీ మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment