ఆక్సి్ఫర్డ్ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా బూస్టర్ డోస్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఆక్సి్ఫర్డ్ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా బూస్టర్ డోస్._ శ్రీకాళహస్తి నందు MGM హాస్పిటల్స్ వారు ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈ రోజు శ్రీకాళహస్తి లోని దాదాపు 70 మంది ఆక్సి్ఫర్డ్ డిగ్రీ కాలేజీ విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా కోవాక్సిన్ బూస్టర్ డోస్ ని వేశారు. పై కార్యక్రమం లో విద్యార్థులు మరియు ఆక్సి్ఫర్డ్ డిగ్రీ కాలేజీ సిబ్బంది ఈ వాక్సినేషన్ లో పాల్గొన్నారు. కళాశాల కరెస్పాండంట్ మధు గారు మాట్లాడుతూ మా కళాశాల విద్యార్థులకు, సిబ్బందికి ఉచితంగా బూస్టర్ డోస్ వేసిన MGM హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. MGM హాస్పిటల్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి నందు విద్యార్థులకే కాకుండా బూస్టర్ డోస్ ని ప్రతి ఒక్కరికి ఉచితంగా వేయ సంకల్పించామని ఈ అవకాశాన్ని విద్యార్థులు,ఇతరులు కూడా వినియోగించుకొనగలరని తెలిపారు. పై కార్యక్రమం లో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment