శ్రీకాలహస్తి MGM హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా కోవిడ్ బూస్టర్ డోస్.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
గతం లో శ్రీకాళహస్తి విద్యార్థిని, విద్యార్థులకు ఎన్నో ఆరోగ్య సదస్సులు నిర్వహించిన MGM హాస్పిటల్స్ వారు ఇప్పుడు అదే సదుద్దేశ్యం తో శ్రీకాళహస్తి ప్రతి పాఠశాల, కళాశాల విద్యార్థుల కు ఉచితంగా బూస్టర్ డోస్ వెయ్యాలని సంకల్పించారు. ఇందులో భాగంగా మొట్టమొదటిగా MGM జూనియర్ కాలేజీ నందు దాదాపు 700 మంది విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా బూస్టర్ డోస్ వేశారు. ఈ కార్యక్రమం లో MGM హాస్పిటల్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్యం కోసం మేము చేయు ప్రతి కార్యక్రమం కళాశాలల, పాఠశాల ల, యాజమాన్యం, తల్లిదండ్రులు సహకరించారని, అలాగే ఈ బూస్టర్ డోస్ కూడా మీ కళాశాల ల, పాఠశాల ల దగ్గరికే వచ్చి ఉచితం గా వేస్తామని ప్రతి విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకొనగలరని తెలిపారు. ఈ బూస్టర్ డోస్ ప్రతి విద్యార్ధి కి చాలా ఉపయోగకరమని తెలిపారు.
No comments:
Post a Comment