విజ్ఞానగిరి శ్రీ కుమారస్వామి ఆలయ మహా కుంభాభిషేకం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
దక్షిణ కైలాసం, వాయు లింగేశ్వరుడు కొలువై వున్న శ్రీకాళహస్తిలోని విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న శ్రీ కుమారస్వామి ఆలయ మహా కుంభాభిషేకం శాస్తోయుక్తం గా నిర్వహించారు. ఆలయ శిఖర కలశం మరియు మూలవిరాట్ కు విశేష అభిషేక పూజలు వేదోయుక్తంగా నిర్వహించారు. మహా కుంభాభిషేకం తమ హయాంలో జరగడం పూర్వజన్మ సుకృతమని ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు.
ఈ పూజాది కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి వాణి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
శ్రీకాళహస్తిలోని విజ్ఞానగిరి పురాణ ఇతిహాసాల ప్రకారం మహోన్నతమైన పుణ్యస్థలం. ఈ పుణ్యస్థలంలో మహా విష్ణువు సైతం తపస్సును ఆచరించి కుమారు స్వామి దర్శనం చేసుకున్నట్లు పురాణాల్లో పేర్కొన్నారు. ఈ మహోన్నతమైన క్షేత్రంలో మహా కుంభాభిషేకం నిర్వహించి 27 ఏళ్లు కావడంతో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సహకారంతో, అంజూరు శ్రీనివాసులు గారి పాలకమండలి ఆధ్వర్యంలో మహా కుంభాభిషేకం చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ మరియు వేద పండితుల ఆధ్వర్యంలో మూడు రోజులుగా వేదోయుక్తంగా పూజాది కార్యక్రమాలు జరిపారు. శుక్రవారం యాగశాల కలశ పూజలు, హోమ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ప్రధాన కలశ జలాలను తీసుకుని ఊరేగింపుగా ఆలయ శిఖరం వద్దకు చేరుకుని ఆలయ శిఖర కలశానికి వేద మంత్రాల నడుము విశేష అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు హరోహర మురగా అంటూ నామస్మరణలు చేశారు.
అనంతరం గర్భాలయంలో శ్రీ కుమారస్వామి మూలవిరాటుకు ప్రధాన కలశ జలాలతో విశేష అభిషేకాలను వేదోయుక్తంగా నిర్వహించారు. అనంతరం విశిష్ట అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆలయ అనుబంధ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని, తమ పాలక మండలి హయాంలో కుమారస్వామి ఆలయ మహాకుంభాభిషేకం అద్భుతంగా నిర్వహించడం జరిగిందని, దానికి కారణమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ 1995 వ సంవత్సరం తర్వాత తిరిగి మరలా ఇప్పుడు కుంభాభిషేకంనిర్వహించడం ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొనటం పూర్వజన్మ సుకృతం అని తెలియజేశారు.
ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ మాట్లాడుతూ ఆది నుంచి తమ కుటుంబం ఈశ్వరి సేవలో తరించడం ఆ భగవంతుని కృప దయాని ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ఈవో సాగర్ బాబు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో కుమారస్వామి కుంబాభిషేకం వైభవంగా నిర్వహించామన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ న్యాయస్థానం సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు , ధర్మకర్తల మండలి సభ్యులు మహీధర్ రెడ్డి, దాసరి జయమ్మ, పసల సుమతి, రమాప్రభ, కొండూరు సునీత, లక్ష్మీ, ఆలయ అధికారులు మల్లిఖార్జున, కృష్ణారెడ్డి, మురళిధర్, లక్ష్మయ్య, స్థపతి కుమార్ వారితో పాటూ విరాళాలను అందజేసిన దాతలు, ఆలయ పూజారులు అర్ధగిరి, కోటి, తులసి, రామకృష్ణ, స్థానిక ప్రముఖులు నంద మెడికల్స్ నరసింహులు, సెన్నేరు కుప్పం శేఖర్, పసల కుమారస్వామి, కోల్లూరు హరి, బాల గౌడ్, తేజు, ప్రసాద్, సునీల్, తేజ మరియు ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment