గోవధ నిషేధ : జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, July 8, 2022

గోవధ నిషేధ : జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్

 ప్రత్యేక పర్వదినాల సమయంలో జంతుబలులు ప్రత్యేకించి గోవధ నిషేధ మని జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.



ఎవరైనా వ్యక్తులు పర్వదినాల సమయంలో మొక్కుబడుల, ఆచారాల పేరుతో గోవధ కు పాల్పడితే వారిని ఆంధ్ర ప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ అనిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్- 1977 ప్రకారం శిక్ష అర్హులని హెచ్చరించారు.
కర్మభూమి అయిన భారత దేశంలో గోవధ నిషేధ మని, చట్టాన్ని అతిక్రమించి గోవధకు పాల్పడినవారు కఠినంగా శిక్షింప పడతారని హెచ్చరించారు.
పర్వదినాల సమయంలో జంతుబలులు ముఖ్యంగా గోవద అరికట్టడానికి ఒక డీఎస్పీ స్థాయి అధికారి ని నోడల్ ఆఫీసర్ గా నియమించడం జరిగిందని, గోవధ అరికట్టడంలో నోడల్ ఆఫీసర్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకుంటారని తెలిపారు.
ఆచారాలు పర్వదినాల పేరుతో మూగజీవాలను వదించడం నేరమన్నరు ఒకవేళ జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు ఏదైనా కారణం చేత జంతువులను సరఫరా చేయదలచుకున్న వాళ్ళు సంబంధిత రెవెన్యూ అధికారి నుంచి అనుమతి పత్రం పొందవలసి ఉంటుందని తెలిపారు.
మూగజీవాల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా సరిహద్దులలో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసి టాస్క్ఫోర్స్ మరియు స్పెషల్ స్క్వాడ్ ల ద్వారా పర్యవేక్షణ చేశామన్నారు.
ఎవరైనా వ్యక్తులు పశువులను అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అదేవిధంగా ప్రార్థనా మందిరాలు ఆలయాల వద్ద బహిరంగ జంతుబలి కి పూనుకుంటే అటువంటి వారిపై చట్టం ప్రకారం అరెస్టు చేయబడుతుందని హెచ్చరించారు.
జంతుబలులు ముఖ్యంగా గోవధ కు సంబంధించిన సమాచారాన్ని పోలీస్ వాట్సాప్ నెంబర్ 7989807665 - నోడల్ అధికారి డిఎస్పి విజయ్ శేఖర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.
జంతుబలులు గోవధ లకు సంబంధించిన సమాచారం తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచి పడుతుందని తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad