సంకట చతుర్దశి హోమం
శ్రీకాళహస్తి ఆలయంలో సంకట చతుర్దశి హోమ పూజలు శాస్త్ర యుక్తంగా నిర్వహించారు. ఈ హోమ పూజాది కార్యక్రమాలకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి హోమ పూజల్లో పాల్గొన్నారు. సంకట చతుర్దశి పురస్కరించుకొని ఆలయంలోని అంజి అంజి వినాయకుని వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్తాపన పూజలు చేసి, హోమ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. హోమ పూజలు అనంతరం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారు అంజి అంజి వినాయకుని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం లో స్వామి అమ్మవార్లు ను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు సాధనమున్న రాయల్, జైశ్యామ్, కొండూరు సునీత, రమాప్రభ, పసల సుమతి, లక్ష్మి, జయమ్మ, మరియు దేవస్థానం అధికారులు Ac మల్లికార్జున ప్రసాద్. దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు కరుణాకరన్ గురుకుల్, వేద పండితులు అర్థగిరి, గోవిందు,పాల్గొన్నారు
No comments:
Post a Comment