జిల్లాలో నేటి నుంచి పోలీస్ 30 యాక్ట్ అమలు
సిసి కెమెరాలు, అత్యాధునిక బాడీ వర్న్ కెమెరాల తో పోలీసుల ప్రత్యేక నిఘా
నిబందలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం
తిరుపతి జిల్లా ఎస్పి పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్
జిల్లాలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గురువారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అంతటా జూన్ నెలాఖరు వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని, 30 పోలీస్ యాక్ట్ అమలు లో ఉండగా బహిరంగ ప్రదేశాలలో సభలు, సమావేశాలు,ర్యాలీలు నిర్వహించకూడదనినారు. ఏదైనా సమావేశాలు, సభలో నిర్వహించాలంటే సంబంధిత పోలీసు అధికారుల దగ్గర అనుమతి తీసుకోవాలని సూచించారు. అలాగే సోషియల్ మీడియాలో రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేయడం కవ్వింపు చర్యలకు పాల్పడటం వంటివి చేయరాదన్నారు.
జిల్లా వ్యాప్తంగా 30 పోలీసు యాక్ట్ నిషేధాజ్ఞలు అమలు ఉంటుందని కావున ప్రజలు గుంపులు, గుంపులుగా ఉండకూడదన్నారు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారన్నారు. ర్యాలీలు,సమావేశాలు,గుంపులు గుంపులుగా గుమిగుడటం డప్పులు వాయించడం, పెద్ద శబ్దాలు,భాణ సంచా పేల్చడం వంటివి కూడా నిషేధించడం జరిగిందన్నారు. రాజకీయ పక్షాలు, ప్రజలు పోలీసు శాఖ కు సహకరించాలని జిల్లా ఎస్పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి. యస్ కోరారు.
No comments:
Post a Comment