తిరుపతి నగరంలో ట్రాఫిక్ మళ్లింపు - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Wednesday, July 13, 2022

demo-image

తిరుపతి నగరంలో ట్రాఫిక్ మళ్లింపు

poornam%20copy
తిరుపతి నగరంలో ట్రాఫిక్ మళ్లింపు
292482413_419131390258099_3253656594460315828_n


Railway over Bridge పై శ్రీనివాస సేతు (గరుడ వారధి) ప్రాజెక్టు పనుల నిమిత్తం వాహనాల దారి మళ్లింపు
తిరుపతి పట్టణం యందు రామానుజం సర్కల్ నుండి పూర్ణకుంబమం సర్కిల్ మధ్య Railway over Bridge (ROB) నిర్మాణ పనులు 15.07.2022 నుండి జరగనున్నది. RTC సెంట్రల్ బస్ స్టాండ్ వైపుకు వచ్చు వాహనాలు అలాగే RTC సెంట్రల్ బస్ స్టాండ్ వైపు నుండి బయట వైపుకు వెళ్ళు వాహనాలు తాత్కాలికంగా ఈ క్రి౦ది తెలిపిన విధ౦గా వివిద దారులలో వాహనాల మళ్లింపు చేయడం జరిగింది.
ట్రాఫిక్ మళ్లింపు వివరాలు:-
హైదరాబాదు, కర్నూల్, కడప, వాహనాలు కరకంబాడి మీదుగా, నెల్లూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, పుత్తూర్ మరియు చెన్నై నుండి వచ్చు వాహనాలు రేణిగుంట, రామనవిలాస్ సర్కిల్, కరకంబాడి, మంగళం లీలమహల్ మీదుగా మళ్ళి౦పబడుతుంది (లేదా) గాజులమండ్యం జంక్షన్, ఆర్.సి పురము జంక్షన్, రామానుజపల్లి చెక్ పోస్ట్, మహిళా యునివర్సిటి, బాలాజి కాలనీ, నంది సర్కిల్ , శ్రీనివాస సేతు మీదుగా మళ్ళి౦చడం జరిగింది.
పల్లెవెలుగు RTC బస్సులు రేణిగుంట మీదుగా నారాయణాద్రి హాస్పిటల్, తిరుచానూర్ ఫ్లై ఓవర్, ఆర్.సి పురము జంక్షన్, MR పల్లి పోలీసు స్టేషన్, అన్నమయ్య, వెస్ట్ చర్చ్ , బాలాజి కాలనీ, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా RTC బస్ స్టాండ్ లోకి మళ్ళి౦చడం జరిగింది.
బెంగళూరు, చిత్తూర్ నుండి వచ్చు RTC బస్సులు రామానుజపల్లి చెక్ పోస్ట్ వద్ద నుండి శ్రీపద్మావతి మహిళా యునివర్సిటి, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా మళ్ళి౦పబడుతాయి (లేదా) చంద్రగిరి టౌన్, చెర్లోపల్లి, జూపార్క్, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా RTC బస్ స్టాండ్ లోకి మళ్ళి౦చడం జరిగింది.
మదనపల్లి, పీలేరు, రాయచోటి, అనంతపురము నుండి వచ్చు RTC బస్సులు చెర్లోపల్లి సర్కల్, బాలాజి కాలనీ, అలిపిరి, నంది సర్కల్, శ్రీనివాస సేతు మీదుగా RTC బస్ స్టాండ్ లోకి మళ్ళి౦పబడుతుంది (లేదా) చెర్లోపల్లి, జూపార్క్, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా RTC బస్ స్టాండ్ లోకి మళ్ళి౦చడం జరిగింది.
లైట్ మోటార్ వాహనాలు బస్ స్టాండ్ నుండి రేణిగుంటకు మరియు రామానుజం, లక్ష్మిపురం సర్కల్ వైపు DBR హాస్పిటల్ మీదుగా హీరో హోండా షోరూమ్ వద్ద Railway level cross, దాటుకొని వెళ్లవచ్చు (Railway level cross ఉన్నందున వాహనదారులు గమనించగలరు.)
అత్యవసర వాహనాలు అంబులెన్స్/మెడికల్, ప్రభుత్వ వాహనాలకు, రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు కారణంగా అందరు సహకరించాలని అలాగే ఉద్యోగస్తులు, స్థానిక ప్రజలు, విద్యా సంస్థలు తమ విద్యార్థుల రవాణా సౌకర్యార్థం అనువైన మార్గంను యెంచుకొని పై మళ్లింపు విషయాన్ని గమనించి ప్రత్యామ మార్గాలను ఎన్నుకొని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తిరుపతి ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించాలని జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ గారు ఒక ప్రకటనలో తెలియపరిచారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages