ఏపీలో అతి భారీవర్షాలు, తెలంగాణలో అత్యంత భారీవర్షాలు... ఐఎండీ తాజా అప్ డేట్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, July 8, 2022

ఏపీలో అతి భారీవర్షాలు, తెలంగాణలో అత్యంత భారీవర్షాలు... ఐఎండీ తాజా అప్ డేట్

 ఏపీలో అతి భారీవర్షాలు, తెలంగాణలో అత్యంత భారీవర్షాలు... ఐఎండీ తాజా అప్ డేట్



రాగల ఐదు రోజుల్లో విస్తారంగా వర్షాలు


ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు వర్ష సూచన


7, 8, 11 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు


ఈ నెల 9న తెలంగాణలో అత్యంత భారీవర్షాలు


చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలకు ఆవర్తనాలు తోడవడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) దేశంలోని పలు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. రాగల ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. 


కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా, ఈ నెల 7, 8, 11 తేదీల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 9వ తేదీన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది...!!

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad