మా బలిజలను గుర్తించింది ఒక్క జగనన్న మాత్రమే,కాపులు తల ఎత్తుకొని నడిచేలా చేసిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం - శ్రీకాళహస్తి బలిజ నాయకులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి "వైయస్సార్ కాపునేస్తం" మూడో విడత విడుదల చేసిన సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణం, వైయస్సార్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్ గారి విగ్రహానికి బలిజ సోదరులతో కలిసి పాలాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి .
అలాగే శ్రీకాళహస్తి బలిజ అక్క చెల్లెమ్మలందరు జై జగన్ నినాదాలతో జగనన్న కటౌట్కు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం పట్టణ బలిజ అక్క చెల్లెమ్మలు ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి..మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా సరే పేద కాపు అక్క/చెల్లెమ్మలకు సంవత్సరంకి 15,000 చొప్పున 3ఏళ్లల్లో ₹45,000 ఆర్థిక సాయం అందించిన జగనన్నకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పూల కృష్ణమూర్తి, స్వర్ణమూర్తి, కొట్టే సత్యం, సాధన మున్నా రాయల్, యతిరాజులు, సెన్నేరుకుప్పం శేఖర్,సూరగారి సురేష్, కంఠ ఉదయ్ కుమార్, మొగారాల గణేష్, చింతామణి పాండు, ముత్తురాల కృష్ణ, మైనంపాటి మస్తాన్,పగడాల హరి, తీగల భాను,వెంకటేశ్వర్లు, చలపతి, రవి, పూడి రవి, గరికపాటి చంద్ర, జలకం కిషోర్, పత్తి మణి, యానాదియ్య, కనపర్తి తిరుపాల్, కె. యస్. సుబ్రహ్మణ్యం, కృష్ణ, తేజ మరియు వైస్సార్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment