పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా బదిలీలు
జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్
జిల్లాల విభజన నేపధ్యంలో చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాల నుంచి తిరుపతి జిల్లా కు వచ్చిన సిబ్బందికి బదిలీలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ నిర్వహించారు.
జిల్లాల విభజన నేపధ్యంలో చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాల నుంచి తిరుపతి జిల్లా కు వచ్చిన సిబ్బందికి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 84 మంది కి (ASI/HC/PC) పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా బదిలీలు నిర్వహించారు.
ఈ బదిలీల ప్రక్రియలో ఎస్పీ ముందుగా ఒక్కొక్కరితో ముఖాముఖి మాట్లాడి, కౌన్సిలింగ్ గురించి సిబ్బందికి ముందుగా వివరించారు. అలాగే సిబ్బంది యొక్క ఆరోగ్య, కుటుంబ సమస్యలను పరిగణలోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్ నందు ఉన్న సదరు ఖాళీలను ప్రత్యక్షంగా స్క్రీన్ పై చూపి వారు కోరుకున్న పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఎక్కువ భాగం అధ్యాత్మిక ప్రదేశాలతో కూడుకున్న నగరము ఇక్కడ ఇతర జిల్లాలో విధుల కన్నా భిన్నంగా వుంటుంది. అత్యంత మర్యాద పూర్వకంగా క్రమశిక్షణతో మెలగి విధులు నిర్వర్తించాలని తెలిపారు.
పోలీస్ శాఖలో బదిలీలు చాలా సాధారణమైన విషయమని, మీరందరూ ఇతర జిల్లాల నుండి ఇష్ట పూర్వకంగా ఈ జిల్లాకు వచ్చారు అదే ఇష్టంతో ఇక్కడ నూతన ఉత్సాహంతో విధులు నిర్వహించాలన్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువగా, జవాబుదారీతనంగా విధులు నిర్వర్తిస్తూ స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలన్నారు.
ముఖ్యంగా ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలుగుతూ శాంతి భద్రతల పరి రక్షణలో వెనుకాడకుండా ప్రముఖ పాత్ర వహించాలని, సమస్యలో ఉన్న బాధితులకు అండగా నిలిచి మేమున్నామనే భరోసాన్ని, ఆత్మస్థైర్యాన్ని కల్పించి పోలీస్ శాఖ యొక్క ప్రతిష్ట పెంపొందించాలని ఆకాక్షించారు.
తమకు అప్పగించిన బాధ్యతలను విధి నిర్వహణలో క్రమశిక్షణతొ ప్రజలకు ఏళ్ల వేళలా నిరంతరం మనసా వాచా కర్మణా గా సేవ చేయడానికి సిద్దంగా ఉంటామని అలాగే పోలీస్ శాఖకు శాఖా పరమైన సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బదిలీపై వచ్చి జిల్లాల్లో వారు కోరుకున్న పోలీస్ స్టేషన్ కు బదిలీ పొందిన వారంతా జిల్లా ఎస్పీ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ శ్రీమతి సుప్రజా మేడం డి.పి.ఒ సిబ్బంది, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమశేర్ రెడ్డి పాల్గొనారు
No comments:
Post a Comment