75 లక్షల విలువచేసే 43 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక కారు ,ఆటో రెండు మోటార్సైకిల్ను సీజ్ చేసిన పోలీసులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, July 7, 2022

75 లక్షల విలువచేసే 43 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక కారు ,ఆటో రెండు మోటార్సైకిల్ను సీజ్ చేసిన పోలీసులు

 75 లక్షల విలువచేసే 43 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక కారు ,ఆటో రెండు మోటార్సైకిల్ను సీజ్ చేసిన పోలీసులు




స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:

భాకరాపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ పంచాయతీలోని దేవరకొండ గొల్లపల్లి గ్రామం సమీపంలో అమ్మవారి చెరువు పొదల వద్ద ఎర్రచందనం దుంగలను సీజ్ చేయడంతోపాటు ఐదుగురు ముద్దాయిలను బుధవారం అరెస్టు చేయడం జరిగింది .
దీనిపై తిరుపతి ఎమ్.ఆర్ పల్లి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అనంతపూర్ రేంజ్ డిఐజి శ్రీ రవి ప్రకాష్ ఐ.పి. యస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ.పి పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారితో కలిసి విలేకరులకు వివరాలను వెల్లడిస్తూ అరెస్టయిన ముద్దాయిలను సీజ్ చేసిన ఎర్రచందనం దుంగలు మరియు వాహనాలను ప్రదర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా డీఐజీ గారు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు హోస్కొట్ కు చెందిన అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు వసీం ఖాన్ మరియు నదీమ్ ఖాన్ లు దేవరకొండ పంచాయతీలోని నాగరాజు అనే వ్యక్తి కి శేషాచల అడవి నుంచి ఎర్రచందనం దుంగలను నరికి, బెంగళూరుకి సరఫరా చేయుటకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం మేరకు నాగరాజు తన బంధువులతో పాటు మరి కొంతమందిని నియమించుకుని శేషాచల అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికి దొంగలను బెంగళూరుకి సరఫరా చేయుటకు సిద్ధం చేసుకున్నారు.
పోలీసులకు రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం దేవరకొండ గొల్లపల్లి గ్రామం సమీపంలోని అమ్మవారి చెరువు వద్ద రవాణాకు సిద్ధంగా ఉంచిన 43 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఐదుగురిని అరెస్టు చేయగా మరో ఏడుగురు స్మగ్లర్లు పారి పోవడం జరిగింది.
అరెస్ట్ అయిన వారి వివరాలు తెలుపుతూ
1. కత్తి అన్నమయ్య, వయస్సు. 25 సం., తండ్రి. పేరు కత్తి. శ్రీరాములు. దేవరకొండ గొల్లపల్లి గ్రామం, దేవరకొండ పంచాయతీ, చిన్నగొట్టిగల్లు మండలం, తిరుపతి జిల్లా, వృత్తి:- ఆటొ డ్రైవరు
2. మామిడికోన సురేష్, వయస్సు.31 సం., తండ్రి. వెంకటయ్య. దేవరకొండ గొల్లపల్లి గ్రామం, దేవరకొండ పంచాయతీ , చిన్నగొట్టిగల్లు మండలం, తిరుపతి జిల్లా, వృత్తి:-పాణి పురి వ్యాపారం
3. దేరంగుల వాసు. వయస్సు.30 సం.,తండ్రి. చిన్నబ్బ. రంగంపేట గ్రామం, చంద్రగిరి మండలం, తిరుపతి జిల్లా, వృత్తి:-బ్ల్యూ డర్ట్ కంపెనీలో కొరియర్ బాయ్.
4. కత్తి ఎర్రయ్య, వయస్సు. 65 సం., తండ్రి. లేట్ వెంకటస్వామి. దేవరకొండ గొల్లపల్లి గ్రామం, దేవరకొండ పంచాయతీ, చిన్నగొట్టిగల్లు మండలం, తిరుపతి జిల్లా. వృత్తి:- కూలీ
5. కత్తి శ్రీరాములు. వయస్సు. 45 సం., తండ్రి. ఎర్రయ్య, దేవరకొండ గొల్లపల్లి గ్రామం, దేవరకొండ పంచాయతీ చిన్నగొట్టిగల్లు మండలం, తిరుపతి జిల్లా, వృత్తి:- కూలీ
పారిపోయిన ముద్దాయిలు
6. కత్తి నాగరాజు, తండ్రి పేరు:- కత్తి ఎర్రయ్య, దేవరకొండ గొల్లపల్లి గ్రామం, దేవరకొండ పంచాయతీ, చిన్నగొట్టిగల్లు మండలం, తిరుపతి జిల్లా.
7. కత్తి తులసి, తండ్రి పేరు:- కత్తి ఎర్రయ్య, దేవరకొండ గొల్లపల్లి గ్రామం, దేవరకొండ పంచాయతీ, చిన్నగొట్టిగల్లు మండలం, తిరుపతి జిల్లా
8. కత్తి.గౌరి శంకర్, తండ్రి పేరు:- కత్తి శ్రీరాములు, దేవరకొండ గొల్లపల్లి గ్రామం, దేవరకొండ పంచాయతీ, చిన్నగొట్టిగల్లు మండలం, తిరుపతి జిల్లా
9. మామిడికోట రెడ్డి ప్రసాద్, దేవరకొండ గొల్లపల్లి గ్రామం, దేవరకొండ పంచాయతీ, చిన్నగొట్టిగల్లు మండలం, తిరుపతి జిల్లా.
10. చిప్పిడి రమేశ్, తండ్రి పేరు-రెడ్డప్ప, వాయల్పాడు గ్రామం, అన్నమయ్య జిల్లా.
ప్రధాన స్మగ్లర్లు
11. వసీం ఖాన్ తండ్రి పేరు;- కరీం ఖాన్, కట్టిగెనహళ్లి, హోసకోటే, బెంగళూరు సిటి, కర్నాటక రాష్ట్రం
12. నదీం ఖాన్, కట్టిగెనహళ్లి, హోసకోటే, బెంగళూరు సిటి, కర్నాటక రాష్ట్రం
కేసు వివరాలు
ఈ సందర్భంగా డీఐజీ రవి ప్రకాష్ గారు మాట్లాడుతూ అరెస్టయిన వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడమే కాక, వారిపై నిఘా ఉంచడం జరుగుతుందని వివరించారు.
పారిపోయిన అంతర్రాష్ట్ర స్మగ్లర్లు వసీం కాన్ మరియు నదీమ్ ఖాన్లను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని త్వరలో వారిని అరెస్టు చేసి వారి వ్యవహారాలను పూర్తి స్థాయిలో అరికట్టడం జరుగుతుందని తెలిపారు.
ఈ ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు చిన్నగొట్టిగల్లు కి రావడం నాగరాజు అతని అనుచరులకు ఎర్రచందనం దుంగలను కర్ణాటక తరలించడానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఆ తర్వాత వారు తిరిగి బెంగళూరుకి వెళ్లడం, వారి సూచన ప్రకారం నాగరాజు అతని అనుచరులు ఎర్రచందనం దుంగలను బెంగళూరు సరఫరా చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పెద్దమొత్తంలో జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టడంలో జరిగిందని దానితోపాటు నిందితులను అరెస్టు చేయడమే కాక వాహనాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.
ఇటీవల తమిళనాడు తిరువన్నామలై జిల్లాలో అరెస్ట్ చేసిన బడా స్మగ్లర్ల , ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడానికి పోలీసులు చేపట్టిన ప్రత్యేక చర్యలు వివరిస్తూ, జాతీయ సంపద అయిన శేషాచలం అడవులకు పరిమితమైన ఎర్రచందనం చెట్లను కాపాడడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
గతంలో ఎర్రచందనం అక్రమ రవాణాలో తమిళ స్మగ్లర్ల కీలక పాత్ర పోషించే వారని కానీ ప్రస్తుతం రాయలసీమలోని గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు ఈ అక్రమ రవాణా దిగుతున్నారని దీనిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు.
ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో రాజీపడే ప్రసక్తే లేదని డి ఐ జి గారు స్పష్టం చేశారు.
ఈ కేసు లో ప్రతిభ చూపిన భాకరాపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ తులసి రామ్, ఆర్మ్డ్ రిజర్వ్ ఆర్ ఐ చంద్రశేఖర్, భాకరాపేట ఎస్సై జి వి ప్రకాష్ కుమార్ చంద్రగిరి ఎస్ ఐ వంశీధర్ , ఆర్మ్డ్ రిజర్వ్ ఎస్ఐ పుల్లన్న, భాకరాపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది డిఐజి గారు మరియు ఎస్పి గారు అభినందించారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad