12 సంవత్సరాలుగా ఉన్న ఇంటి కరెంటు సర్వీసును ఇప్పుడు ఎలా తొలగిస్తారు సి.పి.ఎం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, July 28, 2022

12 సంవత్సరాలుగా ఉన్న ఇంటి కరెంటు సర్వీసును ఇప్పుడు ఎలా తొలగిస్తారు సి.పి.ఎం

 12 సంవత్సరాలుగా ఉన్న ఇంటి కరెంటు సర్వీసును ఇప్పుడు ఎలా తొలగిస్తారు సి.పి.ఎం



మండలంలోని రాచగున్నేరి పంచాయతీ సర్వే నెంబర్ 283 -1 చెరువు కట్టమీద గత 20 సంవత్సరాలు నుంచి ఒక చిన్నపాటి రేకుల షెడ్డు వేసుకొని దీనిలోనే ఒక చిన్న టీ దుకాణం ద్వారా తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న గిరిజన కుటుంబం నివసించే ఇంటికి కరెంటు సర్వీసును తొలగిస్తామంటూ వారికి నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సబబు అని శ్రీకాళహస్తి రూరల్ ఏ.పీఎస్పీ.డీ.సీ.ఎల్ కార్యాలయం ఎదుట గురువారం శ్రీకాళహస్తి సి.పి.ఎం పార్టీ పట్టణ బాధ్యుడు గంధం మనీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గంధం మనీ మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి పంచాయతీలో అతిపెద్ద కర్మాగారంగా పేరుగాంచిన ఈ.సీ.ఎల్ కంపెనీ వారి ఒత్తిడితో 12 సంవత్సరాల నుంచి కరెంటు సర్వీసు ఉన్న నిరుపేద గిరిజన కుటుంబమైన ఎస్. సుబ్రహ్మణ్యం ఇంటికి కరెంటు సర్వీసులు తొలగిస్తామని విద్యుత్ అధికారులు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సబబు అని సి.పి.ఎం పార్టీ ద్వారా డిమాండ్ చేశారు. అలాగే గిరిజనులు ఎక్కువగా రిజర్వుఫారెస్ట్  ప్రాంతంలో, కాలువ గట్ల మీద, చెరువు కట్టల మీద నివాసముంటారు. అటువంటి వారిని ఏ ప్రభుత్వం కూడా వారి నివాసాలను తొలగించినట్లు కానీ వారి ఇంటి కరెంటు సర్వీసులను రద్దు చేసినట్లు గాని శ్రీకాళహస్తిచరిత్రలో ఎక్కడా లేదని తెలిపారు. ఈ.సీ.ఎల్ కంపెనీ యాజమాన్యానికి  లబ్ధి చేయాలనే ఆలోచనతోనే గిరిజన కుటుంబం ఉంటున్న ఇంటికి కరెంటు సర్వీస్ ను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఇటువంటి ఆలోచనలను విద్యుత్ శాఖ అధికారులు మార్చుకోకపోతే అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటాలు ఉదృతం చేయాల్సి వస్తుందని సి.పి.ఎం పార్టీ ద్వారా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు డివిజన్ కార్యదర్శి పెనగడం గురవయ్య రాజా, బాధితులు సుబ్రహ్మణ్యం, మరియు శివ,దుర్గ, గున్నయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad