ఆలుపెరగని స్వాతంత్ర్య సమర యోధుడు - అల్లూరి సీతారామరాజు గారికి ఘన 125 వ జయంతి వేడుకులు
తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు L&O అడిషనల్ యస్.పి శ్రీ కులశేఖర్ గారు, క్రైమ్ అడిషనల్ యస్.పి శ్రీమతి విమలకుమారి మేడం గారు అలుపెరగని స్వతంత్ర సమరయోదుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతిని పురస్కరించుకొని పోలీస్ ప్రధాన కార్యాలయం నందు పోలీస్ అధికారులతో కలిసి అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అలుపెరగని స్వతంత్ర సమరయోదుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు సాయుధ పోరాటం ద్వారానే భారత దేశానికి స్వతంత్రం సిద్ధిస్తుందని నమ్మి, తాను నమ్మిన సిద్ధాంతం కోసం అతి చిన్న వయసులోనే తన ప్రాణాలను తృణ ప్రాయంగా భావించి, 27 సం.ల వయసుకే అమర వీరుడైన యోధుడు అల్లూరి సీతారామరాజు.
తెల్ల దొరల దాస్యానికి బలవుతున్న మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి, గిరిజనులకు అండగా నిలిచి వారిహక్కుల గురించి అవగాహన కల్పించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, దురల వాట్లకు దూరంచేసి స్వాతంత్ర పోరాటానికి సిద్ధం చేసి భారత స్వాతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తిగా వెలుగొంది, బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కోవడంలో చూపిన తెగువ, సాధించిన విజయాలు మనలో ఎంతో ధైర్యాన్ని నింపుతాయి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి.యస్.పి.లు యస్.బి రమణ, చంద్ర శేఖర్, వెస్ట్ నరసప్ప, యస్.సి.యస్.టి సెల్ నాగాసుబ్బన్న, దిశా రామరాజు, ట్రాఫిక్ కాటమరాజు, ట్రాఫిక్ విజయ శేఖర్, కమాండ్ కంట్రోల్ కొండయ్య, ఏ.ఆర్ నంద కిషోర్, సి.ఐ లు, ఆర్.ఐ లు
No comments:
Post a Comment