శ్రీకాళహస్తీశ్వరుని సేవలో పాల్గొన్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు,రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షులు శ్రీ స్వతంత్ర దేవ్ జీ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈరోజు ఉదయం శ్రీకాళహస్తి ఆలయానికి విచ్చేసిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రివర్యులు & బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ స్వతంత్ర దేవ్ జీ గారికి బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి, నియోజకవర్గ బిజెపి పార్టీ ఇంచార్జి శ్రీ కోలా ఆనందకుమార గారు ఆలయ అతిథి గృహం వద్ద నియోజకవర్గ బిజెపి నాయకులతో కలసి ఆత్మీయస్వాగతం తెలియ జేశారు.
అనంతరం ఆలయ ధర్మకర్తలమండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారు, ఆలయ ఈఓ శ్రీ కె. వి. సాగర్ బాబు గారు దక్షిణగోపురం వద్ద స్వాగతం పలికి,ప్రత్యేక రాహు-కేతు పూజా కార్యక్రమం తరువాత స్వామి - అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేసి వేద ఆశీర్వచనం అనంతరం తీర్థప్రసాదాలు, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు....
పై కార్యక్రమం నందు బిజెపి నాయకులు వేడాం క్రిష్ణయ్య, కుప్పా ప్రసాద్, గాండ్ల శివకుమార్, రాజనాల, విశ్వానాథ్,యువమోర్చ సభ్యులు, చందు రాయల్,రవిరాయల్, ఢిల్లీ, బాల, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment