సైబర్ క్రైమ్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, మోసగాళ్ళ బారిన పడకుండా జాగ్రత పడాలి.
టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా కొత్త కొత్త రూపాలతో ఆవిష్కృతమవుతున్నాయి.
సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసు విభాగం తిరుపతిలో అత్యాధునిక టెక్నాలజీతో సైబర్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
జిల్లా యస్.పి శ్రీ పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ గారి నేతృత్వంలో సైబర్ నేరగాళ్లు ఆట కట్టించేందుకు సైబర్ నిపుణులు నిరంతరం కృషి చేస్తూ, సైబర్ నేరాల బారిన పడి ఇబ్బంది పడుతున్న బాధితుల ఆవేదన తొలగించడానికి సిబ్బంది సైబర్ నేర పరిశోధనలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి, పలురకాల సైబర్ మోసాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
తిరుపతి సైబర్ ల్యాబ్ లో గత 7 సంవత్సరాల నుండి మొత్తం 510 సైబర్ కేసు లు నమోదు కాగా, అందులో ప్రధానం గా ఉన్న రెండు సంవత్సరాల లో సుమారు 300 కేసులు నమోదై, తద్వారా భాదితులు సుమారు 4 కోట్ల రూపాయలు మోస పోగా, తిరుపతి సైబర్ ల్యాబ్ అధికారులు మరియు సిబ్బంది త్వరితగతిన దర్యాప్తు చేపట్టి అనుమానిత అకౌంట్ లలో వున్న సుమారు 107 కోట్ల రూపాయలను బ్యాంకు నందు ఫ్రీజ్ చేయించడమైనది. ఇప్పటికే చాలా మంది బాధితులకు సుమారు 31 లక్షల రూపాయలు ఇప్పించడం తో పాటు, గుర్తించిన మిగతా బాధితులకు కూడా కోర్ట్ ద్వారా నగదు ని ఇప్పించడానికి మరియు నేరాలకు పాల్పడిన వారిని పట్టుకోవడం కోసం తగు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అదే విధంగా సోసియల్ మీడియా నేరం కి పాల్పడిన వారిని చాలా మంది ని పట్టుకొని రిమాండ్ కి పంపడం జరిగింది.
రోజు రోజు కి టెక్నాలజీ వినియోగం లోను, ఆన్లైన్ సేవల వినియోగం లోను మరియు సోషియల్ మీడియా వాడకం లో మన దేశం ప్రపంచ దేశాలతో పోటి పడుతుండగా, మరో వైపు భారత ఆర్ధిక మూలాలు దెబ్బ తీసే విధంగా మరియు ఇక్కడి ప్రజల అవగాహన లోపాన్ని ఆసరాగా తీసుకొని సైబర్ నేరగాళ్ళు ఆన్లైన్ లో ఆర్ధిక మరియు సామాజిక నేరాలకు పాల్పడుతూ సాధారణ ప్రజలను ఇబ్బంది కి గురి చేస్తూ వున్నారు. ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పటికి బాగా చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది అత్యాశ, అవసరం మరియు అవగాహన లేకపోవడం తో సైబర్ నేరం బాధితులుగా మారి, కొంత మంది అవమానభారంతో ఎవరికి చెప్పుకోలేక అప్పుల పాలు అయ్యి చివరకు ఆత్మహత్య చేసుకొనే వరకు దారి తీస్తున్నాయి.
తిరుపతి లాంటి మహా నగరం లో రోజు కి లక్షలాది ప్రజలు రాకపోకలు జరగడం, యూనివర్సిటీ మరియు కాలేజి లు ఎక్కువగా ఉన్నందున చాలా మంది ప్రత్యేకించి యువత సైబర్ నేరగాళ్ళ బారిన పడుతున్నారు. బాధితులకు అవగాహన కల్పించడం తో పాటు, నేరగాళ్ళను గుర్తించి బాధితులకు న్యాయం చెయ్యడం కోసం మన పోలీస్ శాఖ తిరుపతి లోని AR ఏ.అర్ పెరేడ్ గ్రౌండ్ నందు 2018 వ సంవత్సరం లో Regional Cyber Forensic Lab ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం తిరుపతి జిల్లా యస్.పి శ్రీ పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ గారి ఆద్వర్యం లో, అడిషనల్ యస్.పి అడ్మిన్ శ్రీమతి సుప్రజ గారి స్వీయ పర్యవేక్షణ లో ఇన్స్పెక్టర్ లు సుబ్రమణ్యం రెడ్డి, విక్రమ్ మరియు సిబ్బంది 10 మంది ఈ సైబర్ క్రైమ్ దర్యాప్తు చేపట్టి జిల్లా లోని పోలీస్ స్టేషన్ల లోని దర్యాప్తు అధికారులకు టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ లో తోడ్పాటు గా ఉంటున్నది.
తిరుపతి లో నమోదైన వివిధ సైబర్ నేరాలు( Financial):
1. ATM Fraud.
2. KYC Update Fraud.
3. Job Fraud.
4. OLX Fraud.
5. Online shopping fraud.
6. Loan Fraud and Loan APP Fraud.
7. Wallet (Phone pay, Google pay, Paytm and etc) Fraud.
8. Any Desk/Team viewer.
9. Debit/Credit Card Fraud.
10. TTD Online Darshan tickets.
11. Online betting.
12. Dealerships fraud.
13. Corona Fraud.
14. Investment fraud.
15. Aadhar Enabled payment system.
16. Matrimony fraud.
Social Medial Crimes:
1. Fake profile.
2. Fake website.
3. Abusing through Face book, WhatsApp, Instagram and etc.,
4. Sexual harassments.
5. Child phonography and etc.
ప్రజలు చేయకూడనిది:
1. క్రెడిట్/డెబిట్ కార్డు, UPI, OTP ఇతర బ్యాంకు కి సంబంధించిన వివరాలను ఎవరితో ను పంచుకోరాదు.
2. అపరిచిత వ్యక్తులు ఫోన్ ద్వారా గాని, SMS ద్వారా గాని లేదా WHATSAPP ద్వారా సంప్రదించినపుడు ఎలాంటి విషయాలను వాళ్ళతో చెప్పకూడదు.
3. లోన్ అని గాని, ప్రైజ్ మని అని గాని, లాటరి అని గాని, ఆఫర్ లు అని గాని ఏదైనా కాల్ చేసి గాని మెసేజ్ ద్వారా గాని తెలిపిన యెడల దానికి స్పందించి తెలియకుండా అత్యాశ కి పోయి మీ సమాచారాన్ని పంచుకోని, మీ యొక్క అకౌంట్, మొబైల్ మరియు ఇతర సమాచారాన్ని చెప్పి వారి బారిన పడి మోసపోయి మీ డబ్బులను పోగొట్టుకోవద్దు.
4. ఎవరైనా ఫోన్ చేసి ప్రభుత్వ లావాదేవి లు అని, KYC అప్డేట్ అని, ఆదార్ వెరిఫికేషన్ అని, CORONA బిల్ అని చెప్పి ఏదైనా మొబైల్ లో గాని, ఎకౌంటు వివరాలు గాని అడిగినా లేదా ఏదైనా అప్లికేషను ను ఇన్స్టాల్ చేసుకోమని చెప్పినా అలాంటివి చెయ్యకూడదు.
5. బ్యాంకు అధికారులు అని OTP చెప్పమని, లేదా ఏదైనా లింక్ పంపి దాని లో వున్న అప్లికేషను ను ఇన్స్టాల్ చేసుకోమని చెప్పినా అలాంటివి చెయ్యరాదు మరియు OTP ని పంచుకోరాదు.
ప్రజలు చేయవలసింది:
1. ఎప్పటికి అప్పుడు మీ యొక్క నెట్ బ్యాంకింగ్, మొబైల్ ఫోన్, WALLET మరియు ఇతరత్రా వాటి యొక్క పాస్వర్డ్ ని మారుస్తూ వుండాలి.
2. సోషియల్ మీడియా లోని అప్లికేషన్స్ WHATSAPP, FACEBOOK, INSTAGRAM, TELEGRAM, TWITTER మరియు ఇతరత్రా అప్లికేషన్స్ ను ఉపయోగించే సమయం లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
3. దురాశ దుఖానికి చేటు అని అత్యాశ కి పోయి ONLINE గేమ్స్, తెలిసి తెలియని వాటి లో ఇన్వెస్ట్మెంట్, త్వరితగతిన లోన్ వస్తుంది అని తెలిసి తెలియని LOAN APPS ద్వారా లోన్ లు తీసుకొనే సమయం లో అన్ని వివరాలు షేర్ చేసి ప్రమాద బారిన పడకండి.
4. మీ యొక్క ఫోటో లను అందులోనూ ప్రత్యేకించి స్త్రీల యొక్క ఫోటో లను వీలైనంత వరక్జు DP లు గా పెట్టుకోరాదు.
5. ఏదైనా అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసే సమయం లో వాటికి పర్మిషన్ ఇచ్చే సమయం లో తగు జాగ్రత్తగా వుండండి. మీరు ఇచ్చిన పర్మిషన్ ఆధారం గా మీ మొబైల్ లో వున్న అన్ని డేటా ని తస్కరించి వాటిని దుర్వినియోగపరిచే అవకాశం వుంది.
సైబర్ నేరం బారిన పడితే తీసుకోవలసిన చర్యలు:
1. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ లోని ఏ.అర్ పోలీస్ గ్రౌండ్ లోని Regional Cyber Forensic Lab నందు నేరుగా సంప్రదించి గాని, హెల్ప్ లైన్ నెంబర్: 1930 కి ఫోన్ చేసి గాని, తిరుపతి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నెంబర్: 9154141884 కి గాని సంప్రదించవలెను.
2. బ్యాంకు లావాదేవి లకు సంబదించినది అయితే వెంటనే బ్యాంకు వారిని వెంటనే సంప్రదించాలి.
3. Cyber crime portal: cybercrime.gov.in నందు వివరాలను నమోదు చేసి పిర్యాదు చేసిన యెడల తగు న్యాయం పొందాలి.
4. ఏదైనా తెలియని కమర్షియల్ కాల్ గాని, మెసేజ్ లు నోటిఫికేషన్ లు గాని వచ్చిన యెడల TRAI సంస్థ కు 1909 ద్వారా SMS పంపి వాటిని BLOCK చేయించండి.
5. బాధితులు నేరం జరిగిన తరువాత ఎంత త్వరగా పిర్యాదు చేసిన యెడల అంత త్వరితగతిన న్యాయం పొందే అవకాశం వున్నది.
“చివరగా కష్టపడనిదే ఏది రాదు అన్న విషయాన్ని మర్చిపోకుండా, అపరిచిత వ్యక్తుల మోసపూరిత మాటలు నమ్మి మీరు ఆర్ధిక నష్టం తో పాటు మానసిక వ్యధ కి లోను కాకండి.”
సైబర్ క్రైమ్ గురించి అవగాహన పెంచుకోండి, నలుగురి తో పంచుకోండి, మీతో పాటు మీకు తెలిసిన వారు సైబర్ క్రైమ్ బారిన పడకుండా తగు జాగ్రత్త వహించండి తిరుపతి జిల్లా పోలీస్ వారి విజ్ఞప్తి.
No comments:
Post a Comment