మోటార్లకు మీటర్లు వద్దు ఏపీ రైతు సంఘం డిమాండ్.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
రాష్ట్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం నిరంకుశ విధానాలు తూచా తప్పకుండా రాష్ట్రంలో అమలు చేస్తున్న తీరును నిరసిస్తూ అందులో భాగంగా రైతులు వ్యవసాయానికి వాడుకునే విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఆమోదించడం సిగ్గుచేటైన విషయమని రైతు సంఘం డివిజన్ కార్యదర్శి బత్తయ్య విమర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంట పెట్టుబడులు పెరిగి మద్దతు లేక తీవ్ర నష్టాల్లో కూలిపోయి బలవన్ మరణాలకు పాల్పడుతున్నారని ఇటువంటి సందర్భంలో విద్యుత్ మోటార్లకు మీటర్ల బిగించి తద్వారా ఉచిత విద్యుత్తుకు మంగళం పాడే ఎత్తుగడలో భాగంగా దీన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్తు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దాని ద్వారా పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి సందర్భంలో మూల్గే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మోటార్లకు మీటర్లు పెట్టడం రైతులను మోసగించడమేనని దుయ్యబట్టారు ఈ విధానాన్ని విరమించుకోకపోతే రైతుల పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటాలకు దిగి రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో రైతు సంఘం పూర్వ జిల్లా కార్యదర్శి పుల్లయ్య రైతులు వెంకటయ్య దాము రాజా చిన్నబాబు మనీ గురవయ్య తదితరులు పాల్గొన్నారు
మోటార్లకు మీటర్లు వద్దంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో తొట్టంబేడు మండలంలోని బోనుపల్లి సబ్ స్టేషన్ వద్ద రైతుల ఆందోళన ఈ కార్యక్రమంలో రైతు సంఘం డివిజన్ కార్యదర్శి బత్తయ్య పూర్వపు జిల్లా కార్యదర్శి పుల్లయ్య నాయకులు సురేషు రాజా వెంకటయ్య దాము గురవయ్య మణి తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment