ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టాను సారంగా ఫీజు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
పీడీ ఎస్ యూ రాష్ట్ర కోశాధికారి S. జాకీర్.
శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి తమ ఇష్టానుసారంగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారని పి.డి.ఎస్.యు రాష్ట్ర కోశాధికారి S. జాకీర్ అన్నారు. బుధవారం నాడు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) ఆధ్వర్యంలో అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల వద్ద ధర్నాలో నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు రాష్ట్ర కోశాధికారి s. జాకీర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని కార్పొరేట్ విద్యాసంస్థలు నారాయణ,శ్రీ చైతన్య, భాష్యం మరియు ప్రైవేట్ విద్యాసంస్థలు అక్రమంగా డొనేషన్, పుస్తకాలు, యూనిఫామ్ అనేక పేర్లతో విద్యార్థుల నుండి అక్రమంగా వేలాది రూపాయలు ఫీజులు వసూళ్లు చేస్తున్నారని అన్నారు. శ్రీకాళహస్తి లో గుర్తింపు లేని పాఠశాలలు,ఒకే గుర్తింపుతో రెండు పాఠశాలలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై శ్రీకాళహస్తి విద్యాశాఖ అధికారులు తనిఖీ చేయకపోవడంతో విద్యాసంస్థల యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.విద్యార్థుల తల్లిదండ్రులు నుండి ఫీజుల రూపంలో నిలువు దోపిడీ చేస్తున్న విధాసంస్థలపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యాసంస్థల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేస్తామని యాజమాన్యాలకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో , పీడీ ఎస్ యూ టౌన్ కమిటీ సభ్యులు. సాయి.విజయ్.బాను శశి మాబాష తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment