శ్రీకాళహస్తిలో డ్రగ్ లైసెన్స్ కార్యాలయం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, July 18, 2022

శ్రీకాళహస్తిలో డ్రగ్ లైసెన్స్ కార్యాలయం

 శ్రీకాళహస్తిలో డ్రగ్ లైసెన్స్ కార్యాలయం రావడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపిన ప్రెసిడెంట్ నరసింహులు



శ్రీకాళహస్తి పట్టణంలోని సీబీ రెసిడెన్స్ లో శ్రీకాళహస్తి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు నంద మెడికల్స్ నరసింహులు, సెక్రెటరీ ముని రెడ్డి, ట్రెజరర్ చిన్నారావు మరియు గౌరవ సీనియర్ అధ్యక్షులు అమరా జనార్ధన్... మొదలైన కార్యవర్గ సభ్యులు, మరియు పట్టణంలోని అన్ని మెడికల్ షాప్ ఓనర్లు హాజరయ్యారు.

అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ.... జిల్లా విభజన తర్వాత గూడూరులో ఉన్న డ్రగ్ లైసెన్స్ కార్యాలయము శ్రీకాళహస్తిలోకి రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. అలాగే మన జిల్లాకు సంబంధించిన మన జోనల్ లో ఉన్న మండలంలో జరుగు పనులన్నీ శ్రీకాళహస్తి డ్రగ్ లైసెన్స్ కార్యక్రమం నుంచి జరుగుతుంది అని అన్నారు . అలాగే అన్ని మెడికల్ షాప్ వాళ్ళు ప్రభుత్వం సూచించిన సూచనలను పాటిస్తూ తగు జాగ్రత్తగా సేవా దృక్పథంతో పనిచేయాలని అన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad