పోలీస్ స్పందనకు ప్రజల అభినందనలు
తప్పిపోయిన పిల్లలను సకాలంలో స్పందించి తల్లితండ్రులకు అప్పగించిన చంద్రగిరి పోలీసులు.
అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్.
తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్న నలుగురు పిల్లలు కనిపించడం లేదు అంటూ బాధిత తల్లితండ్రులు స్టేషన్ కు వచ్చి పిర్యాదు చేయడంతో సీఐ ఓబులేసు వెంటనే స్పందించి సిబ్బందిని వెతకటానికి పంపించారు.
అందుబాటులో ఉన్న పోలీస్ పెట్రోలింగ్ వాహనాలన్నిటిని రంగంలో దింపి వ్రేతకటం ప్రారంబించారు గంటలోనే పిల్లల ఆచూకీని చేదించరు
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిఐ గారి సమక్షంలో పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు.
కాలూరు కు చెందిన లావణ్య తన పిల్లలు దీక్షిత, హయాత్ వీరిద్దరిని చంద్రగిరి కెనరా బ్యాంక్ మిద్ది పైన కాపురం ఉంటున్న రాజేష్, అశ్విని దంపతుల పిల్లలు దీపక్, ఇందు కలిసి చదువుకునేందుకు లావణ్య తన పిల్లలను వదిలి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత పిల్లల కొరకు లావణ్య కెనరా బ్యాంకు వద్దకు రావడంతో పిల్లలు నలుగురు కలిసి కిందకు దిగారని తెలుసుకొని పిల్లల తల్లిదండ్రులు వెతక సాగారు పిల్లలు కనిపించకపోవడంతో చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన సీఐ ఓబులేసు సిబ్బందిని మరియు పెట్రోలింగ్ వాహనాలను పిల్లలను వెతకడానికి పంపించారు.
దారి తప్పిన పిల్లలు నడుచుకుంటూ వెళ్లడం గమనించిన కొందరు పొలుసులకు సమాచరం అందించారు తదుపరి పిల్లలను సిఐ గారు వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు మిక్కిలి సంతోషంతో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
పిల్లల కోసం గాలించి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన కానిస్టేబుల్స్ రవికుమార్, ధనంజయ నాయుడు, హేమలాల్ భాషా, వేణుగోపాల్, గాయత్రి, సిఐ ఓబులేష్, ఎస్ఐలు వంశీధర్, హిమబింధు లను జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డీ ఐ.పి. యస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
No comments:
Post a Comment