పారిశుద్ధ కార్మికులకు అండగా "జనసేన.. - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, July 13, 2022

పారిశుద్ధ కార్మికులకు అండగా "జనసేన..

 పారిశుద్ధ కార్మికులకు అండగా "జనసేన..




స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


గత కొంతకాలంగా  పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న న్యాయమైన నిరసనలకు మద్దతు గా జనసేన పార్టీ వారికి సంఘీభావం తెలియజేసారు...

ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి మాట్లాడుతూ....

తన పాదయాత్ర లో వైస్ జగన్ రెడ్డి ..మునిసిపల్ కార్మికులకు,రోడ్లు ఊడ్చే వారికి,మరుగుదొడ్లు శుభ్రం చేసే వారికి లక్ష రూపాయలు ఇచ్చినా తక్కువే అని ఆ రోజు మాటలు చెప్పారు,ఆరు వేలు హెల్త్ ఇన్సూరెన్స్ అని  చెప్పింది ఈ జగన్ రెడ్డి గారే. ఇప్పుడు 7 నెలలు గా ఒక్కఒకరికి 6వేలు లెక్కన 42 వేలు  ఈ ప్రభుత్వం ప్రతి కార్మికునికి బకాయి పడ్డాది. అప్పటి నుంచి పారిశుద్ధ్య కార్మికులు ఎదురు చూసారు. పై పెచ్చు మీ జీతం 3 వేలు పెంచుతున్నాం అని హెల్త్ అలవెన్స్ 6వేలు ఆపేసారు.3వేలు పెంచడం ఏంటి 6వేలు ఆపేయడం ఏంటి..దీన్ని ఇది ఏమి అన్యాయం అని మా జీతం మాకు ఇవ్వండి,మా హెల్త్ అలవెన్స్ మాకు ఇవ్వండి అని అడుగుతుంటే పట్టించుకోకుండా,సమ్మె నోటీసు 15 రోజల ముందు న ఇచ్చినా అది కూడా పట్టించుకోకుండా,ఈ వైసిపి మాటలు అంతా ప్లినరి సమావేశాల్లో మునిగి పోయారు,కనీసం కార్మిక నాయకులను పిలిచి మాట్లాడి చర్చలు జరుపుతాం అని కూడా అనలేదు. సమ్మె ప్రారంభించిన తరువాత పిలిచి మంత్రులు ఏం మాటలు చెపుతున్నారు,ఇవాళ పెంచలేము జీతం 2024 లో మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే అప్పుడు మీకు జీతం పెంచుతాం అని చెప్తారా,ఇదా మంత్రులు చెప్పాల్సిన మాట ,బాధ్యత కలిగిన పదవుల్లో ఉండే వారు చెప్పాల్సిన మాటేనా ఇది. సమ్మెకు కారణం ప్రభుత్వమే,సమ్మె చేయడానికి కార్మికులు కారణం కాదు,ప్రభుత్వం యొక్క మొండి వైఖరి,కార్మిక వ్యతిరేకమైన వైఖరి,వాళ్ల వేతనాల్లో కోత పెట్టి,వాళ్లకు రావాల్సిన బకాయిల్లో కోత పెట్టి బకాయిలు ఇవ్వకుండా వేల మంది కార్మికుల్ని రోడ్డున వేసిన పాపం ఈ ప్రభుత్వానిదే.అంతే కాదు వాళ్లని పర్మినెంట్ చేస్తామని ఆశ పెట్టారు,హామీ లిచ్చారు,ముఖ్యమంత్రి

గారేమో పర్మినెంట్ గా 30 ఏళ్ళు ఆయనే కుర్చీలో కూర్చోవాలి,కానీ 20ఏళ్ళు 30 ఏళ్ళు కాంట్రాక్టు గా పనిచేస్తున్న వాలను పర్మినెంట్ చేస్తామని చెప్పి ఎందుకు పర్మినేట్ చేయరు.అంటే మీ సీటు ,మీ కుర్చీ పర్మినెంట్ ఆ కార్మికులను పర్మినేట్ చేయరా...అందుకే వాళ్ళు గత్యంతరం లేకుండా సమ్మె చేస్తున్నారు.

ఇప్పటికైనా వాళ్లకి ఆపేసిన బకాయిలు వాళ్లకి ఇవ్వండి,పర్మనెంట్ చేయండి.వాళ్ళు సమస్యను పరిష్కరించండి..ఈ రోజు సమ్మె అపాలంటే ప్రభుత్వం మే చొరవ తీసుకోవాలి.

దినికి తోడు ఒక వైపున ఏమో ప్రజల మీద చెత్త పన్ను వేసి ప్రజల్ని బాదుతున్నారు...ఇంకో వైపున జీతాల్లో కోత పెట్టి కార్మికుల్ని ఇబ్బంది పెడుతున్నారు.మరో వైపున ఏమో ప్రజల గురించి ముసలి కన్నీరు కారుస్తున్నారు.

ఇప్పటికైనా కార్మికుల సమస్యను జటిలం చేయకుండా పరిష్కరించండి .. ఈ రోజు జరుగుతున్న సమ్మెకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలియచేస్తూ.ప్రభుత్వం ఇకనైన ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామిల్ని వెంటనే అమలు చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో

 జనసేన నాయకులు కుమార్

మాధవ మహేష్,చిరంజీవి, *బద్రి, లీలా మరియు జనసైనికులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad