విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఉన్నత పాఠశాలలను అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు.. - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, July 8, 2022

విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఉన్నత పాఠశాలలను అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు..

విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఉన్నత పాఠశాలలను అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు..


రాష్ట్ర వ్యాప్తంగా 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌గా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలను బాలికలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆదేశాలు వెలువరించింది.హై స్కూల్‌ ప్లస్‌ పాఠశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో రెండు కోర్సులు మాత్రమే అందించనున్నట్టు స్పష్టం చేసింది. స్థానికంగా ఉన్న డిమాండ్‌ను అనుసరించి కోర్సులు నిర్థారించాలని నిర్ణయించింది. పీజీటీ సమాన స్థాయి అధ్యాపకులనే బోధనకు తీసుకోనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. 1752 స్కూల్‌ అసిస్టెంట్లను 292 జూనియర్‌ కళాశాలల్లో పనిచేసేందుకు నియమిస్తామని వెల్లడించింది. ఆయా పాఠశాలల్లో నాడు- నేడు పనులు చేపట్టిన దృష్ట్యా ఇక అదనపు తరగతి గదులను మంజూరు చేయమబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad